Varun Tej: పెళ్లైన పది రోజులకే మెగా బుద్ధి బయటపెట్టిన వరుణ్ తేజ్..!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇటీవల లావణ్య త్రిపాఠిని పెళ్లి చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈనెల 1న ఇటలీలోని టుస్కానీలో సన్నిహితులు, బంధువుల సమక్షంలో వీరి పెళ్లి ఘనంగా నిర్వహించారు. ఇక వీరి పెళ్లి తర్వాత నవంబర్ 5న హైదరాబాద్ లో సినీ ప్రముఖుల కోసం రిసెప్షన్ నిర్వహించారు. ఈ వేడుకకి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఇక పెళ్లి ఫోటోలు, రిసెప్షన్ ఫోటోలు కూడా బాగా వైరల్ అయ్యాయి. ఈ ఫోటోలు చూసిన చాలామంది మెగా అభిమానులు ఫుల్ ఖుషి అయ్యారు.

ఇదిలా ఉంటే.. తాజాగా వరుణ్ తేజ్ తీసుకున్న నిర్ణయం తెలుసుకొని మెగా ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. అదేంటంటే పెళ్లి తర్వాత సరదాగా భార్యతో గడపడానికి వరుణ్ తేజ్ హనీమూన్ కి వెళతారని అంతా భావించారు. కానీ వరుణ్ తేజ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ విశయాలతో బిజీబిజీగా మారిపోయారు. ప్రస్తుతం వరుణ్ తేజ్ చేతిలో రెండు ప్రాజెక్టులు ఉన్నాయి. తన కెరీర్ లో 14వ చిత్రం “మట్కా” మూవీ పనులలో బిజీగా మారిపోయారట వరుణ్ తేజ్. మట్కా అనేది 1958 – 1982 మధ్యకాలంలో వైజాగ్ డ్రాప్ లో సెట్ చేయబడిన పీరియాడిక్ మూవీ.

యావత్ దేశాన్ని కదిలించిన వాస్తవ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పలాస చిత్రం దర్శకుడు కరుణకుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం పూర్తి కాగానే మరొకటి ఆపరేషన్ వాలంటైన్. ఈ చిత్రంలో వరుణ్ పైలెట్ గా కనిపించబోతున్నారు. అయితే పెళ్లి తర్వాత హనీమూన్ వెళతారని అందరూ అనుకుంటే వరుణ్ తేజ్ మాత్రం సినిమాలతో బిజీ కావడంతో ఇప్పుడే ఎందుకు బాసు అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్లు.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు