Nagarjuna: అమలను కాదని ఆమె కోసం అలాంటి పని చేసిన నాగార్జున.. నిజమేనా..?

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మన్మధుడి గా, కింగ్ గా, గ్రీకు వీరుడు గా పేరు దక్కించుకున్న అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరొకవైపు బిగ్ బాస్ వంటి షోలకు హోస్ట్ గా చేస్తూ భారీ పాపులారిటీ సొంతం చేసుకుంటున్నారు. ఇకపోతే ప్లే బాయ్ గా కూడా గుర్తింపు తెచ్చుకున్న ఈయన దాదాపు చాలా మంది హీరోయిన్లతో రిలేషన్ లో ఉంటూ నిత్యం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారుతూ ఉండేవారు.

ఇకపోతే దగ్గుబాటి వారసురాలు లక్ష్మీని వివాహం చేసుకున్న తర్వాత ప్రముఖ నటి అమల ను ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నారు. అయినా కూడా ఎంతోమంది హీరోయిన్లతో లవ్ ట్రాక్ నడిపించారు. అలాంటి వారిలో అనుష్క , రమ్యకృష్ణ , స్నేహ, ఆమని , శ్రియా, రజిని, సోనాలి బింద్రే ఇలా ఎంతోమంది హీరోయిన్ లు ఆయన ప్రేమించిన వారి లిస్టులో ఉన్నారు. ఇకపోతే నాగార్జునకి సినీ ఇండస్ట్రీలో మిగతా హీరో లతో పోల్చుకుంటే ఎఫైర్ లిస్ట్ కాస్త ఎక్కువే అని చెప్పాలి. రమ్యకృష్ణ , టబు, అనుష్క వంటి హీరోయిన్లతోనే ఎక్కువగా ఉన్నారని వార్తలు వినిపిస్తూ ఉంటాయి. ఇక మరొకవైపు అనుష్క, టబు ఇప్పటికి వివాహం చేసుకోకపోవడానికి కారణం నాగార్జున అంటూ ఒక వార్త ఇండస్ట్రీలో వినిపిస్తూ ఉంటుంది .

ఇదిలా ఉండగా పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్న లక్ష్మీకి విడాకులు ఇచ్చి అమలను ప్రేమించి వివాహం చేసుకున్న ఈయన.. ఆమెను కాదని మరొక హీరోయిన్ కోసం ఏకంగా ఖరీదైన ఫ్లాట్ ను బహుమతిగా ఇచ్చారట. ఆమె ఎవరో కాదు అనుష్క శెట్టి.. అప్పట్లో సూపర్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈమె రెండు, మూడు సినిమాలు వరుసగా నాగార్జునతో నటించేసరికి వీరిద్దరి మధ్య ఏదో ఉందనే వార్తలు వినిపించాయి.. ఇక అదే సమయంలో నాగార్జున.. అనుష్క హైదరాబాదులో ఉండడానికి ఒక ఖరీదైన ఫ్లాట్ ను కూడా బహుమతిగా ఇచ్చారట.

- Advertisement -

అంతేకాదు ఇప్పటికీ కూడా హైదరాబాద్ వచ్చినప్పుడు ఆ ఫ్లాట్ లోనే అనుష్క ఉంటుందని సమాచారం. ఏది ఏమైనా సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి ఖరీదైన బహుమతులు హీరో హీరోయిన్లు ఇచ్చుకోవడం కామన్.. కానీ ఇలాంటి వార్తలు మాత్రం ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. ఏది ఏమైనా సొంత భార్య ఉండగానే అనుష్క కోసం ఆయన మళ్లీ ఖరీదైన ఫ్లాట్ ను కొనివ్వడంతో ఈ విషయం కోసం కాస్త హాట్ టాపిక్ గా మారింది.
Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు