Nagarjuna: నాగ్ ఈసారి సెంటిమెంట్ ను బ్రేక్ చేయబోతున్నాడా?

కింగ్ నాగార్జున ఈసారి తన సెంటిమెంట్ బ్రేక్ చేస్తాడా? ఇండస్ట్రీ వర్గాల్లో ఇదే ప్రశ్న స్టార్ట్ అయ్యింది. సంక్రాంతి అనేది టాలీవుడ్ సీనియర్ హీరోలకు ముఖ్యంగా నాగార్జునకు కలిసి వచ్చిన పండగ. గతంలో అక్కినేని నాగార్జున హీరోగా నటించిన సోగ్గాడే చిన్ని నాయనా, బంగార్రాజు వంటి సినిమాలు సంక్రాంతి కానుకగా విడుదలై, బాక్సాఫీస్ ను షేక్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తరువాత నాగ్ కొన్ని ప్రయోగాత్మక యాక్షన్ చిత్రాలను చేసినప్పటికీ, అవి బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా పడ్డాయి, దీంతో ఆయన కాస్త టైం తీసుకుని తనకు అచ్చి వచ్చిన జోనర్ లోనే “నా సామి రంగ” అనే చిత్రాన్ని చేయనున్నట్టు ప్రకటించాడు. ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శ్రీనివాస చిట్టూరి తన సొంత బ్యానర్ శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

టైటిల్‌ అనౌన్స్‌మెంట్‌తోనే సినిమాకు పాజిటివ్‌ బజ్‌ వచ్చింది. అల్లరి నరేష్, రాజ్ తరుణ్ వంటి యంగ్ హీరోలు కూడా ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం మాస్ ఎంటర్టైనర్ అని టైటిల్ తోనే చెప్పక చెప్పేశారు మేకర్స్. ఇక ఇది ఖచ్చితంగా సంక్రాంతికి మంచి చిత్రం అవుతుందని నాగార్జున కూడా భావించారట. అందుకే వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. అందుకు తగ్గట్టుగానే మూవీ షూటింగ్ శరవేగంగా చేస్తున్నారు. “నా సామి రంగ” చిత్రం షూటింగ్ ను డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని భావిస్తున్నారు. ప్రస్తుతం మ్యూజిక్ సెషన్స్ జరుగుతున్నాయి. దిగ్గజ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి, పాటల రచయిత చంద్రబోస్ ఇటీవలే ఓ సాంగ్ ను కంపోజ్ చేశారు. దానికి సంబంధించిన పిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే.

అయితే లేటెస్ట్ ఇండస్ట్రీ బజ్ ఏంటంటే.. “ఫ్యామిలీ స్టార్”లాగే “నా సామి రంగ” కూడా సంక్రాంతి రేసు నుంచి తప్పుకోబోతోంది. మరి నాగార్జున తన సెంటిమెంట్‌ను బ్రేక్ చేస్తాడా లేక సంక్రాంతికే “నా సామి రంగ”ను రిలీజ్ చేయాలని పట్టుబడతారో చూడాలి. ఈ సంక్రాంతికి ఇప్పటికే “గుంటూరు కారం”, హనుమాన్, ఈగిల్, సైంధవ్ అనే 4 స్ట్రెయిట్ సినిమాలు విడుదల కానున్నాయి. అలాగే కొన్ని తమిళ డబ్బింగ్ సినిమాలు కూడా బరిలో ఉన్నాయి. మరి నాగార్జున ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

- Advertisement -

Grab Filmify for the latest web stories on Celebrities, today’s Tollywood news, the latest images of actors & actresses, new movie ratings & reviews, and the latest entertainment news from all Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు