తెలుగు ప్రేక్షకులకు వేణు తొట్టెంపూడి పరిచయం అక్కర్లేని పేరు. స్వయంవరం, చిరు నవ్వుతో, కళ్యాణ రాముడు, ఖుషి ఖుషీగా, పెళ్ళాం ఊరెళితే, చెప్పవే చిరుగాలి, హనుమాన్ జంక్షన్ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అమితంగా అలరించాడు వేణు. అలాగే ఎన్టీఆర్-బోయపాటి కాంబోలో వచ్చిన దమ్ము సినిమాలో కూడా ఓ క్యారెక్టర్ లో కనిపించాడు. దీపి తర్వాత వేణు సినిమాలకు దూరమయ్యాడు. దాదాపు 9 ఏళ్ళ పాటు ఇండస్ట్రీలో కనిపించలేదు. మధ్యలో తెలుగు దేశం పార్టీ తరుపున ప్రచారం చేస్తూ ఓ సారి కనబడ్డాడు.
ఇదిలా ఉండగా, వేణు తాజా గా ఓ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. రవితేజ నటిస్తున్న రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో సి. ఐ మురళీ అనే పాత్రలో కనిపించనున్నాడు.
దీంతో పాటు పారా హుషార్ అనే సినిమాలోనూ వేణు నటిస్తున్నాడు. అయితే వేణు తొట్టెంపూడికి రీ ఎంట్రీ కలిసి రావాలి అంటే, రామారావు ఆన్ డ్యూటీ హిట్ అవ్వాలి. లేదా ఆ చిత్రంలో సీ. ఐ మురళీ పాత్ర బాగా పండాలి. రివ్యూలలో వేణు పాత్ర పై ప్రశంసలు వస్తే, వేణు రీ ఎంట్రీ గ్రాండ్ గా జరిగినట్టు. మరి అది అవుతుందా లేదా అనేది జూలై 29 కి ఓ క్లారిటీ వస్తుంది.