Jr NTR: తారక్ ఈ సీనియర్ హీరో కాలు విరగ్గొట్టాడా? నాగ్ షాకింగ్ కామెంట్స్

సీనియర్ హీరో శ్రీకాంత్ తాజాగా గాయాలపాలయ్యాడట. ఇటీవల ఓ బుల్లితెర షోలో శ్రీకాంత్ కాలికి కట్టు కట్టుకుని కనిపించాడు. అయితే మరో సీనియర్ హీరో నాగార్జున మాత్రం యంగ్ టైగర్ ఎన్టీఆర్ నీ కాలును విరగొట్టాడా? అంటూ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

శ్రీకాంత్ ప్రస్తుతం హీరో ఇమేజ్ నుంచి పక్కకు వచ్చి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నాడు. మరోవైపు విలన్ గానూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. అయితే రెండు విధాలుగాను ఆయనను అదృష్టం వరించడం లేదు. అందుకే ఇప్పటిదాకా ఈ సీనియర్ హీరోకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సరైన బ్రేక్ రాలేదు. బాలయ్య “అఖండ” సినిమాలో సూపర్ విలన్ గా కనిపించినప్పటికీ, ఆ తర్వాత మాత్రం టాలీవుడ్ మేకర్స్ ఆయనను అలాంటి రోల్స్ తో ఎంకరేజ్ చేయలేదు.

కారణం ఏంటో తెలియదు కానీ శ్రీకాంత్ ను విలన్ గా తీసుకోవడానికి టాలీవుడ్ డైరెక్టర్స్ వెనకాడుతున్నారని అర్థమవుతుంది. అందుకే అప్పుడప్పుడు సపోర్టింగ్ రోల్స్ తో తెలుగు ప్రేక్షకులను పలకరిస్తున్నాడు శ్రీకాంత్. ప్రస్తుతం ఈ సీనియర్ నటుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ “గేమ్ చేంజర్”, యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో “దేవర” వంటి భారీ ప్రాజెక్టులో పాలుపంచుకుంటున్నాడు.

- Advertisement -

ఇక ఆయన మెయిన్ రోల్ లో నటించిన “కోటబొమ్మాలి పిఎస్” అనే మూవీ రిలీజ్ కు రెడీగా ఉంది. ఈ నేపథ్యంలోనే శ్రీకాంత్ “కోటబొమ్మాలి” మూవీ ప్రమోషన్స్ కోసం బిగ్ బాస్ స్టేజ్ పై ఎంట్రీ ఇచ్చారు. అయితే అదే సమయంలో నాగార్జున శ్రీకాంత్ కాలికి ఉన్న పట్టిని గమనించి, అసలు ఆ గాయం ఎలా అయిందని ప్రశ్నించారు. దానికి కారణం తారక్ కాదు కదా… అని సరదాగా కామెంట్ చేశాడు. ఇక శ్రీకాంత్ కాలి గాయం విషయానికి వస్తే… ఆ గాయం ‘దేవర’ షూటింగ్ గోవాలో జరుగుతుండగా ప్రమాదవశాత్తు అయిందని చెప్పుకొచ్చాడు.

అక్కడ ఉన్న ఇసుక దిబ్బల్లో పరిగెడుతుంటే కాలు బెణికిందని, అయితే చిన్న గాయమే కదా అని పట్టించుకోకుండా షూటింగ్ లో జాయిన్ అయ్యాడట. ఆ తర్వాత కాసేపటికే కాలు వాచిపోయిందట. దీంతో డాక్టర్ వద్దకు వెళ్లగా రెస్ట్ తీసుకోమని చెప్పారట. కానీ శ్రీకాంత్ మాత్రం రెస్ట్ తీసుకోకుండా షూటింగ్ పూర్తి చేశాడట. ఇక ‘దేవర’ మూవీ విషయానికి వస్తే ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాదులో జరుగుతుంది. ఈమధ్యనే మరో కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేశారు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ రెండు భాగాలుగా రానుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న మొదటి పార్ట్ రిలీజ్ కానుంది.

Get the latest celebrity news updates, Bollywood movie updates, and the latest news in Tollywood here at Filmify. Also, grab Filmify for the latest movie release dates & Tollywood gossip news, etc.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు