JigarthandaDoubleX: ఆ హీరోయిన్ చెత్త… రిపోర్టర్ కు డైరెక్టర్ కు దిమ్మతిరిగే రిప్లై

ప్రముఖ తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ ఓ జర్నలిస్టు హీరోయిన్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రాఘవ లారెన్స్, ఎస్‌జే సూర్య ప్రధాన పాత్రల్లో “జిగర్తాండ డబుల్ ఎక్స్” అనే మూవీ ఈ ఏడాది దీపావళి కానుకగా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. అందులో రాఘవ లారెన్స్ కు జోడిగా మలయాళం నటి నిమిషా సజయన్ నటించింది. సినిమాకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, దీపావళి విన్నర్ గా నిలిచింది. అదేరోజు కార్తీ హీరోగా నటించిన ‘జపాన్’ మూవీ కూడా రిలీజ్ అయింది. కానీ ఆ మూవీ కార్తీకి నిరాశనే మిగిల్చింది. మొత్తానికి ఈ బాక్స్ ఆఫీస్ వార్ లో “జిగర్తాన డబుల్ ఎక్స్ టీం” విన్ అయింది.

ఈ సందర్భంగా మేకర్స్ ప్రేక్షకులకు, అలాగే మీడియాకు కృతజ్ఞతలు తెలియజేయడానికి సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ థ్యాంక్స్ గివింగ్ మీట్ లో ఓ జర్నలిస్ట్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ ను షాకింగ్ క్వశ్చన్ అడిగాడు. తన ఫస్ట్ తమిళ మూవీ ‘చిన్నా’లో నిమిషా అందంగా కనిపించనప్పటికీ, బాగానే నటించింది. కానీ ఆమె ఏం అందంగా ఉందని మీ సినిమాలో తీసుకున్నారు? రాఘవ లారెన్స్ కు జోడిగా నిమిషాలు ఎలా తీసుకున్నారని ఆ రిపోర్టర్ ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు కార్తీక్ సుబ్బరాజు స్పందిస్తూ నిమిషా ఎందుకు అందంగా లేదని సదర్ రిపోర్టర్ ను తిరిగి క్వశ్చన్ చేశాడు.

“బహుశా అది మీ ఆలోచనా విధానం అయ్యుండొచ్చు. ఎవరైనా అందంగా లేరని మీరు ఎలా చెప్తారు? అది చాలా తప్పుడు ఆలోచన. అలా కామెంట్ చేయడం దాదాపు శారీరక వేధింపులతో సమానం. దానికి కఠినమైన శిక్ష కూడా పడే అవకాశం ఉందంటూ అతనికి దిమ్మతిరిగే సమాధానం ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండగా, సందర్భానికి తగినట్టుగా కార్తీక్ సుబ్బరాజు ఇచ్చిన సేవేజ్ ఆన్సర్ సూపర్ అంటూ అందరూ అతన్ని ప్రశంసిస్తున్నారు.

- Advertisement -

ఇక ఈ వెంట్ ఇటీవల చెన్నైలో జరగగా “జిగర్తాండ డబుల్ ఎక్స్ మూవీ” హీరోయిన్ యాక్టింగ్ స్కిల్స్ గురించి మాట్లాడకుండా, ఇలా బాడీ షేవింగ్ కామెంట్స్ చేయడం బాధాకరం అంటున్నారు ఈ యంగ్ బ్యూటీ ఫ్యాన్స్. ముఖ్యంగా ఇటీవల కాలంలో కొంతమంది రిపోర్టర్లు పాపులర్ అవ్వడానికి ఇలాంటి దారిని ఎంచుకుని, అభాసు పాలవుతున్నారు. మన టాలీవుడ్ లో కూడా ఇలాంటి కొన్ని సంఘటనలు వైరల్ అయిన సంగతి తెలిసిందే.
Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు