Amani: ఆమని మేనకోడలు కూడా హీరోయినే..ఈమె అందం ముందు స్టార్స్ కూడా..!

సాధారణంగా కొత్త నీరు వస్థే పాత నీరు పోయినట్టుగా సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త హీరో హీరోయిన్లు వస్తూ ఉంటారు. అయితే అందులో కొంతమంది స్వయంకృషితో అడుగుపెడితే మరి కొంతమంది నటీనటుల వారసులుగా అడుగుపెడుతూ ఉంటారు.అలా ఈ క్రమంలోనే ప్రముఖ సీనియర్ హీరోయిన్ ఆమని మేనకోడలు కూడా సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా అడుగు పెట్టింది. తాజాగా బిగ్ బాస్ సీజన్ 5 విజేతగా నిలిచిన వీ.జే. సన్నీ హీరోగా తాజాగా వస్తున్న చిత్రం సౌండ్ పార్టీ..

ఇటీవలే గత మూడు రోజుల క్రితం ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదల చేయగా ఆద్యంతం కామెడీతో ఈ ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ ట్రైలర్లో హీరోయిన్ హృతిక శ్రీనివాస్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిందని చెప్పవచ్చు. మంచి అందం , అందానికి తగ్గట్టుగా హైట్.. అద్భుతమైన నటనతో చూపరులను ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు. ఇకపోతే ఈమె ఆమని మేనకోడలు అన్న విషయం బహుశా చాలామందికి తెలియదు అనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక హృతిక శ్రీనివాస్ విషయానికి వస్తే.. ఇటీవల “అల్లంత దూరాన”అనే సినిమా తీసిన ఈమె త్వరలోనే ఈ సినిమా విడుదలకు సిద్ధం కానుంది. మరొకవైపు సన్నీ హీరోగా నటిస్తున్న ” సౌండ్ పార్టీ” చిత్రంలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది. నవంబర్ 24న అంటే శుక్రవారము ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ట్రైలర్ విడుదలవ్వడంతో ఈమె ఎవరని అందరూ ఆరా తీయగా ఆమె ఆమని మేనకోడలని సమాచారం.

- Advertisement -

ఇదిలా ఉండగా సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న హృతికా శ్రీనివాస్ మాట్లాడుతూ..ఆమని నాకు మేనత్త అయినప్పటికీ నేను చిన్నతనంలో షూటింగులకు వెళ్లింది తక్కువే..నాకు ఊహ తెలిసే సమయానికి మా మేనత్తకు పెళ్లి కావడంతో షూటింగ్ లకు వెళ్లడం కుదరలేదు . కానీ ఇప్పుడు అత్తతో కలిసి షూటింగ్ లకి వెళ్తున్నాను.. రియాల్టీ షోలు, సీరియల్స్ సినిమా సెట్స్ కి కూడా వెళ్తూ ఉంటాను. నాకు నటి కావాలని వుందని అత్తతో చెప్పినప్పుడు.. చదువుకుంటున్నావు కదా! అప్పుడే ఎందుకు? చాలా కష్టపడాలి.. అని అత్త చెబుతూ ఉండేవారు. అయితే నేను కష్టపడతానని చెప్పి వచ్చాను ప్రస్తుతం చదువుకుంటూనే సినిమాలు కూడా చేస్తున్నాను అంటూ హృతిక శ్రీనివాస్ తెలిపింది.. ఇకపోతే హృతిక శ్రీనివాస్ అందం ముందు స్టార్ హీరోయిన్లు కూడా తక్కువే అంటూ కొంతమంది నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు
Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు