Ananya Pandey : పాములు పాకుతుంటే పాపకు హెవెన్ లా ఉందట… ఇదేం పిచ్చిరా బాబూ !

పాములు వంటి సరీసృపాలను చూస్తే చాలామందికి ఒళ్ళు జలదరిస్తూ ఉంటుంది. అలాగే భయం కూడా వేస్తుంది. కానీ విజయ్ దేవరకొండ హీరోయిన్ కు మాత్రం హెవెన్ లో ఉన్నట్టుగా సమ్మగా ఉందట.

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ ‘లైగర్’తో పాన్ ఇండియా హీరోగా ఎదిగిపోయాడు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా రిజల్ట్ నిరాశ కలిగించినప్పటికీ విజయ్ దేవరకొండకు మాత్రం మంచి పాపులారిటీని పెంచేసింది. ఇక ఈ మూవీలో హీరోయిన్ గా నటించిన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకుంది.

కానీ ఆమె ఆశలన్నీ అడియాశలయ్యాయి. ఆ తరువాత పెద్దగా టాలీవుడ్ నుంచి ఆఫర్లు అందుకోవడానికి కూడా ఆసక్తి చూపించలేదు. కానీ ‘లైగర్’తో టాలీవుడ్ ప్రేక్షకులకు మాత్రం బాగా సుపరిచితురాలైంది. తాజాగా ఏ బ్యూటీ పాములను ఒంటిపై పాకించుకుంటూ, ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

- Advertisement -

ముఖేష్ అంబానీ ఇంట జరిగిన గ్రాండ్ బర్త్ డే పార్టీకి అనన్య కూడా హాజరైంది. ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ కవల పిల్లలు కృష్ణ, ఆదియాల ఫస్ట్ బర్త్ డే నవంబర్ 19న అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ముఖేష్‌, నీతా అంబానీలు తమ మనవళ్ల కోసం ఏర్పాటు చేసిన గ్రాండ్ పార్టీకి పలువురు సెలెబ్రిటీలను ఆహ్వానించారు. ముఖ్యంగా ఇందులో పలువురు బాలీవుడ్ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ పార్టీలో షారుక్ చేతిలో పాము పట్టుకుని కనిపించాడు. వీరి వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. తాజాగా అనన్య పాండే పాములతో ఆడుకుంటున్న పిక్స్ నెట్టింట్లో సందడి చేస్తున్నాయి.

పిక్స్ లో ప్రింటెడ్ షార్ట్ డ్రెస్‌లో నెటిజన్లను ఆకట్టుకున్న అనన్య ‘స్వర్గానికి నా నిర్వచనం – కుక్కపిల్ల, పాము… నాకు ఇష్టమైన రెండు జంతువులు..’ అంటూ పోస్ట్ చేసింది. పాములతో ఉన్న పిక్స్ ను పోస్ట్ చేయడమే కాకుండా ఆమె చేసిన పోస్ట్ ను చూసి అనన్య అభిమానులు కూడా ఆశ్చర్యపోతున్నారు. కానీ ఆమెను విమర్శించేవారు మాత్రం పాములను ఒంటిపై పాకించుకోవడమే కాకుండా స్వర్గం అంటూ పోస్ట్ చేసింది… ఇదేం పిచ్చిరా బాబూ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

కాగా అనన్య చివరగా ‘డ్రీమ్ గర్ల్ 2’ చిత్రంలో కనిపించింది. ఈ మూవీ బ్లాక్క్ బస్టర్ హిట్. ఆయుష్మాన్ ఖురానా ఈ చిత్రంలో హీరోగా నటించాడు. వీరిద్దరి కెమిస్ట్రీకి అభిమానులు బ్రహ్మరథం పట్టారు. అంతేకాదు ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను రాబట్టింది.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు