MANGALAVARAM: మంగ‌ళవారం 3రోజుల క‌లెక్ష‌న్స్..హిట్ రావాలంటే ఇంకా ఎంత రావాలంటే..?

ఒక‌ప్పుడు క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌కే క‌లెక్ష‌న్స్ వ‌చ్చేవి. కానీ ఇప్పుడు ప్రేక్ష‌కుల అభిరుచి మారిపోయింది. సినిమాలో కంటెంట్ ఉంటే ఏ సినిమా అయినా క‌లెక్ష‌న్స్ కొల్ల‌గొడుతోంది. ఇక ప్ర‌స్తుతం హ‌ర్ర‌ర్ సినిమాల హావా టాలీవుడ్ లో క‌నిపిస్తోంది. హ‌ర్ర‌ర్ సినిమాలుగా బాక్సాఫీస్ ముందుకు వ‌చ్చిన విరూపాక్ష‌, పొలిమేర‌-2, మ‌సూద సినిమాలు మంచి విజ‌యాలు సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడ అదే లిస్ట్ లో పాయ‌ల్ రాజ్ పుత్ ప్ర‌ధాన పాత్ర‌లో అజ‌య్ భూప‌తి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన మంగ‌ళ‌వారం సినిమా కూడా చేరింది.

శుక్రవారం విడుద‌లైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి క‌లెక్ష‌న్స్ రాబ‌డుతోంది. అయితే మొద‌టి రెండు రోజులు మంచి క‌లెక్ష‌న్స్ రాగా మూడో రాజు మాత్రం ఇండియా ఆస్ట్రేలియా ఫైన‌ల్ మ్యాచ్ కార‌ణంగా క‌లెక్ష‌న్స్ పై ప్ర‌భావం ప‌డింది. మూడోరోజు ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ.1.02 కోట్ల షేర్ రాబ‌ట్టింది. రెండు కోట్ల వ‌ర‌కూ గ్రాస్ వ‌సూలు చేసింది.

ఇక మొత్తం మూడు రోజుల్లో మంగ‌ళ‌వారం సినిమా నైజాంలో రూ.2.16 కోట్లు వ‌సూలు చేసింది. సీడెడ్ లో రూ.81 ల‌క్ష‌లు, ఉత్త‌రాంధ్ర‌లో రూ.68ల‌క్ష‌లు, ఈస్ట్ గోదావ‌రిలో రూ.38 ల‌క్ష‌లు, వెస్ట్ గోదావ‌రిలో రూ. 26 ల‌క్ష‌లు, గుంటూరులో రూ.36ల‌క్ష‌లు, నెల్లూరులో రూ.16ల‌క్ష‌లు, కృష్ణాలో రూ.22 ల‌క్ష‌లు వ‌సూలు చేయ‌గా మొత్తం క‌లిపి రూ.5 కోట్ల షేర్ వ‌సూలు చేసింది. అదేవిధంగా రూ.8.70 కోట్ల గ్రాస్ వ‌సూలు చేసింది.

- Advertisement -

ఇదిలా ఉంటే మంగ‌ళ‌వారం సినిమా హిట్ అవ్వాలంటే ఇంకా రూ.7 కోట్ల షేర్ ను రాబ‌ట్టాలి. అయితే ఈ సినిమాకు పోటీగా వ‌చ్చిన చిత్రాల‌లో మంగ‌ళ‌వారం సినిమాపైనే ప్రేక్ష‌కులు ఆస‌క్తి చూపించ‌డంతో సినిమా ప‌క్కా హిట్ అవుతుంద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు

Filmify gives an interesting update on celebrities in Tollywood & Bollywood and other industries. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other Movies news, etc.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు