BANDLA GANESH :సినిమాల నుండి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన వాళ్ళలో బండ్లన్నే బంగారమా..?

సినిమా ఇండ‌స్ట్రీ నుండి చాలా మంది సెల‌బ్రెటీలు రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇస్తుంటారు. ఎన్టీఆర్, ఎంజీఆర్ కాలం నాటి నుండి చాలా మంది తార‌లు పొలిటిక‌ల్ ఎంట్రీ ఇచ్చి ప్ర‌జాసేవ చేశారు. అయితే సాధార‌ణ వ్య‌క్తులు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన‌ప్పుడు వారిపై ఉండే ఫోక‌స్ కంటే సినిమా తార‌లు వ‌చ్చిన‌ప్పుడు వారిపై ఎక్కువ ఫోక‌స్ ఉంటుంది. అంతే కాకుండా ప్ర‌జాజీవితంలోకి వ‌స్తారు కాబ‌ట్టి చాలా బాధ్య‌త‌గా వ్య‌వ‌హ‌రించాల్సి ఉంటుంది. అవినీతికి పాల్ప‌డటం, పార్టీలు మార‌డం లాంటివి చేస్తే తీవ్ర విమ‌ర్శ‌లు త‌ప్ప‌వు. ఇక చాలా మంది ఒక పార్టీ న‌చ్చ‌క‌పోయినా..

ప‌ద‌వులు రాక‌పోయినా కండువాలు మార్చేస్తుంటారు. నేటి తార‌ల్లో నాలుగైదు పార్టీలు మారిన వాళ్లు సైతం ఉన్నారు. అయితే ఒక‌ప్పుడు క‌మెడియ‌న్ గా ఎంట్రీ ఇచ్చి ఆ త‌ర‌వాత నిర్మాత‌గా మారిన బండ్ల గ‌ణేష్ కూడా రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. బండ్ల గ‌ణేష్ 2018 ఎన్నికల స‌మయంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఆ ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర‌వాత పూర్తిగా రాజ‌కీయాల‌కు గుడ్ బై చెబుతున్నాన‌ని అన్నారు. ఆ త‌ర‌వాత మ‌ళ్లీ ఇప్పుడు ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఆయ‌న రీఎంట్రీ ఇచ్చారు. కానీ బండ్ల గ‌ణేష్ మాత్రం ఏ పార్టీలోకి మార‌లేదు. కాంగ్రెస్ అధికారంలో లేని స‌మ‌యంలో ఆ పార్టీ కండువా క‌ప్పుకుని ఇప్ప‌టికీ అదే పార్టీలో కొన‌సాగుతున్నారు. ప‌లు ఇంట‌ర్వ్యూల‌లో త‌మ తాత‌ల నుండి కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానం అని చెబుతుంటారు. మ‌రోవైపు బండ్ల గ‌ణేష్ కు ఉన్న క్రేజ్ వ‌ల్ల ప‌లు పార్టీల నుండి ఆయ‌న‌కు పిలుపు వ‌చ్చింది.

- Advertisement -

అయిన్ప‌టికీ తాను న‌మ్మిన సిద్దాంతాన్నే ప‌ట్టుకుని కాంగ్రెస్ లో కొన‌సాగుతున్నారు. మ‌రోవైపు ఎలాంటి పద‌వులు ఆశించ‌కుండా పార్టీ ఆదేశిస్తే పోటీ చేస్తాన‌ని అవ‌కాశం ఇవ్వ‌క‌పోయినా పార్టీ గెలుపు కోసం ప‌నిచేస్తాన‌ని ఆయ‌న చెప్ప‌డం నిజంగా గొప్ప విష‌యం. కాబ‌ట్టి ప్ర‌స్తుతం రాజ‌కీయ ప‌రిస్థితులు సినిమా వాళ్ల జంపింగ్లు చూస్తుంటే బండ్ల‌న్న నిజంగా బంగార‌మే అని ఒప్పుకోవాల్సిందే

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు