Srikanth: జగ్గు భాయ్‌కి గట్టి పోటీ

జగపతి బాబు.. కొన్నెళ్ల క్రితం తెలుగు పరిశ్రమలో మంచి పేరున్న హీరో. కానీ, కొద్ది రోజుల తర్వాత హీరోగా అవకాశాలు రాకపోవడంతో విలన్ పాత్రలు చేయడం స్టార్ట్ చేశాడు. మంచి సక్సెస్ సాధించాడు. ఇప్పుడు అదే దారిలో శ్రీకాంత్ కూడా వెళ్తున్నాడు. అఖండ సినిమాతో మొదటి సారి విలన్ పాత్ర చేశాడు. ఈ సినిమాలో వరదరాజులు అనే పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంది. దీంతో శ్రీకాంత్ విలన్ పాత్ర సెట్ అవుతాడిన ప్రూవ్ అయింది.

దీని తర్వాత శ్రీకాంత్ విలన్ పాత్రలతో పాటు పలు సినిమాల్లో కీలక పాత్రలు కూడా చేస్తూ వస్తున్నారు. ఇటీవల జేమ్స్, వారీసు ( తెలుగులో వారసుడు) తో పాటు హంట్ సినిమాల్లో శ్రీకాంత్ కనిపించాడు. తాజాగా రామ్ చరణ్ , కియారా అద్వానీ జంటగా, శంకర్ దర్శకత్వంలో వస్తున్న #RC15లో కూడా కీలక పాత్ర చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ లో భాగంగా రామ్ చరణ్, శ్రీకాంత్ కలిసి ఉన్న ఫోటోలు లీక్ అయిన విషయం తెలిసిందే. ఇలా వరుసగా పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ.. జగపతి బాబుకు గట్టి పోటీనిస్తున్నాడు.

ఇదిలా ఉండగా, తాజాగా శ్రీకాంత్ మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో జాయిన్ అయినట్టు తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న NTR30 సినిమాలో ఓ కీలక పాత్రను శ్రీకాంత్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. కాగా ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం బాలీవుడ్ సుందరి జాన్వీ కపూర్ ను తీసుకున్నారు. దీనిపై ఇటీవలే అధికారిక ప్రకనట వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు ఈ సినిమాలో శ్రీకాంత్ కూడా నటిస్తుంన్నాడు అంటూ రూమర్స్ వస్తున్నాయి. అయితే దీనిపై ఇప్పటి వరకు మూవీ టీం నుంచి గానీ, శ్రీకాంత్ నుంచి గానీ, ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

- Advertisement -

అయినా హీరోయిన్ ను ప్రకటన చేయడానికి కొరటాల శివ దాదాపు 8 నెలల సమయం తీసుకున్నాడు. మరి సినిమాలో కాస్ట్ అండ్ క్రూ ను ప్రకటించడానికి ఎంత సమయం పడుతుంది ? సినిమా షూట్ స్టార్ట్ చేయడానికి ఎంత సమయం పడుతుంది ? అంటూ ప్రేక్షకులు అంటున్నారు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు