Kajal Aggarwal: సెకండ్ ఇన్నింగ్స్‌లో ‘డబుల్” స్పీడ్

తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది హీరోయిన్ కాజల్ అగర్వాల్. 2007లో లక్ష్మీ కళ్యాణం సినిమాతో కాజల్ అగర్వాల్ తెలుగు ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి.. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోలందరితో వరుస సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ అయిపోయింది. తెలుగు ప్రేక్షకుల గుండెల్లో తన అందంతో, నటనతో గూడు కట్టుకున్న ఈమె తెలుగులోనే కాకుండా తమిళ్, హిందీ భాషల్లో కూడా నటించి మెప్పించింది. ఇక కరోనా సమయంలో సడన్ గా ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లు ని 2021 అక్టోబర్ 31 తేదీన వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.

ఆ తరువాత గతేడాది ఏప్రిల్ 19వ తేదీన పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఇక ఇన్ని రోజులపాటు కుటుంబంతోనే గడిపిన ఈమె సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. తాజాగా కాజల్ నటించిన “ఘోష్టి ” అనే తమిళ సినిమా విడుదలకి సిద్ధమైంది. కాజల్ ప్రధాన పాత్రలో కళ్యాణ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. హారర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో యోగిబాబు ఓ ముఖ్య పాత్రలో నటించారు. ఈ చిత్రం మార్చ్ 17న ప్రేక్షకుల ముందుకి రాబోతుంది.

అయితే ఈ చిత్రంలో కాజల్ ద్విపాత్రాభినయం చేస్తుంది. ఒక పాత్రలో పోలీస్ గా, మరొకటి సినీ నటి క్యారెక్టర్ లో కాజల్ అగర్వాల్ కనిపించనుందట. డ్యూయల్ రోల్ చేయడం కాజల్ కు ఇదే మొదటిసారి. సీడ్ పిక్చర్స్ బ్యానర్ పై తెరక్కుతున్న ఈ చిత్రానికి శ్యామ్ సిఎస్ సంగీతం అందిస్తున్నారు. అయితే సెకండ్ ఇన్నింగ్స్ తో మళ్లీ దూసుకుపోవాలనుకుంటున్న కాజల్ ఈ సినిమాతో ఏ మేరకు మెప్పిస్తుందో వేచిచూడాలి.

- Advertisement -

For More Updates : 

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు