Vijay : చివరి సినిమాకు కెరీర్లోనే హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ అందుకుంటున్న విజయ్

Thalapathy Vijay

కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ తన సొంత రాజకీయ పార్టీని ఇటీవల అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సందర్భంగానే తాను త్వరలోనే సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నాను అన్న విషయాన్ని కూడా బయట బయటపెట్టి అభిమానులకు షాక్ ఇచ్చారు. ప్రస్తుతం తాను చేస్తున్న ప్రాజెక్టును పూర్తి చేసిన తర్వాత, ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఒకే ఒక్క ప్రాజెక్టులో మాత్రమే నటించబోతున్నానని విజయ్ క్లారిటీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే విజయ్ చివరి సినిమా దర్శకుడి గురించి రోజుకో వార్త బయటకు వస్తోంది. తాజా సమాచారం మేరకు విజయ్ తన చివరి సినిమా కోసం కెరీర్ లోనే హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నారు. ఇంతకీ విజయ్ రెమ్యూనరేషన్ ఎంత? అంటే…

ప్రస్తుతం విజయ్ “ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం” అనే సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ మూవీని షార్ట్ గా “ది గోట్” అని పిలుచుకుంటున్నారు. ఫస్ట్ లుక్ తోనే స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేసిన ఈ మూవీని కస్టడీ ఫేమ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడు. టైటిల్ తోనే మంచి క్రేజ్ తెచ్చుకున్న “ది గోట్” ప్రస్తుతం రెండవ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటుంది. ఇక విజయ్ చివరి సినిమాలు ఇవే కావడంతో సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. యువన్ శంకర్ రాజా ఈ మూవీకి మ్యూజిక్ అందిస్తుండగా ప్రభుదేవా, మీనాక్షి చౌదరి, స్నేహ, లైలా యోగి బాబు లాంటి నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ పూర్తయ్యాక విజయ్ మరో సినిమాకు కమిట్ అయ్యారు. అది పూర్తి చేసిన తర్వాతనే ఆయన పూర్తిస్థాయిలో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు.

- Advertisement -

ట్రిపుల్ ఆర్ ప్రొడ్యూసర్ డివివి దానయ్యతో విజయ్ ఒక సినిమా చేయాల్సి ఉంది. పొలిటికల్ ఎంట్రీకి ముందు ఆయన చేయబోయే చివరి సినిమా ఇదే అవుతుంది. భారీ బడ్జెట్ తో రూపొందనున్న ఈ సినిమాకు విజయ్ ఏకంగా 200 కోట్లు రెమ్యూనరేషన్ గా డిమాండ్ చేశాడని తెలుస్తోంది. అయితే విజయ్ ఇప్పుడు కోలీవుడ్ లో స్టార్ హీరో కావడంతో పాటు ఆయన చివరి సినిమా కూడా ఇదే కావడంతో నిర్మాత విజయ్ అడిగినంత పారితోషికం ఇవ్వడానికి రెడీగా ఉన్నారని సమాచారం. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు కోసం దర్శకుల వేట కొనసాగుతోంది. ఈ మూవీకి వెట్రీమారన్ దర్శకత్వం వహించే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. కానీ ఇంకా దీనిపై అధికారిక ప్రకటన రాలేదు. అయితే గతంలో వారసుడు సినిమా కోసం దిల్ రాజు విజయ్ కు 120 కోట్లు పారితోషకం ఇవ్వగా, దానయ్య ఏకంగా 200 కోట్లు చెల్లించడం హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న “గోట్” సినిమాకు విజయ్ 150 కోట్లు రెమ్యూనరేషన్ గా తీసుకుంటుండడం గమనార్హం.

Checkout Filmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other film industries Movies updates, etc

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు