Jr.NTR: ఆ యాక్సిడెంట్ ఎన్టీఆర్ జీవితాన్నే మార్చేసిందా..?

Jr.NTR.. టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఇండియాలో మంచి క్రేజ్ సంపాదించుకొని పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించారు..RRR సినిమా తర్వాత ఎన్టీఆర్ వరుసగా పాన్ ఇండియా చిత్రాలకే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.. ప్రస్తుతం ఎన్టీఆర్ చేతిలో దేవర, వార్ -2 సినిమాలతో పాటు ప్రశాంత్ నీల్ తో ఒక సినిమాని చేయబోతున్నారు.. గతంలో జూనియర్ ఎన్టీఆర్ కి జరిగిన ఒక సంఘటన ఆయన జీవితాన్నే మార్చేసినట్లు తెలుస్తోంది..వాటి గురించి చూద్దాం.

యాక్సిడెంట్ గురైన ఎన్టీఆర్..

2009లో ఎన్టీఆర్ టీడీపీ పార్టీ కోసం ఒక ప్రచారాన్ని చేశారు. అయితే ఆ ప్రచారంలో భాగంగా ఎన్టీఆర్ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే.. ఈ యాక్సిడెంట్ లో ఎన్టీఆర్ కు చాలా తీవ్రమైన గాయాలయ్యాయి.. ఈ గాయాల నుంచి బయటపడిన తర్వాత ఎన్టీఆర్ తిరిగి మళ్లీ అదే ఎనర్జీతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ యాక్సిడెంట్ తర్వాత ఎన్టీఆర్ ఆలోచనలలో కూడా ఒక్కసారిగా మార్పు మొదలయ్యిందట.. గాయాల నుంచి కోలుకున్న తర్వాత ఒక ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ తన మనసులో మాటను తెలియజేశారు.

ఆ నమ్మకమే బ్రతికించింది..

మంచు లక్ష్మీ యాంకర్ గా చేస్తున్న షోలో పాల్గొన్న ఎన్టీఆర్ ను మంచు లక్ష్మీ ఇలా అడుగుతూ.. యాక్సిడెంట్ నుంచి కోలుకున్న తర్వాత నీ మైండ్ లో వచ్చిన మొట్టమొదటి అంశం ఏంటి అని అడగగా.. అందుకు ఎన్టీఆర్ బతికినన్ని రోజులు తప్పనిసరిగా ఎంజాయ్ చేస్తూ ఏదో ఒకటి సాధించాలని.. చావు ఎదురొస్తే దానిని స్వీకరించాలని.. తనకు జరిగిన ఆక్సిడెంట్ లో తాను చనిపోతాను అనుకోలేదని.. కానీ తనలో ఏదో తెలియని బలమైన కాన్ఫిడెంట్ కూడా వచ్చిందని తెలిపారు.. అయితే ఇంత త్వరగా చనిపోననే నమ్మకం కూడా తనకు ఉందని.. తాను సాధించాల్సింది ఇంకా ఏదో ఉంది కదా అనే నమ్మకం కూడా కలిగిందని తెలిపారు. దేవుడు నాకు అన్యాయం చేయడు అన్న నమ్మకమే నన్ను బ్రతికించింది అంటూ తెలిపారు ఎన్టీఆర్..

- Advertisement -

వారి మాటలు కంటే గూస్ బంప్స్ వచ్చేవి..

6 నెలల వ్యవధిలోని కోలుకున్నానని.. యాక్సిడెంట్ తర్వాత తనలో పూర్తిగా ఆలోచనలు మారిపోయాయని తెలిపారు.. తన తాత స్థాపించిన పార్టీ కాబట్టి ఆ బాధ్యతతోనే ప్రచారం చేశాను.. అయితే భవిష్యత్తులో ఏం జరుగుతుందనేది ఎవరు ఊహించలేము.. అభిమానుల మాటలు కేకలు విన్నప్పుడు ఎన్నోసార్లు తనకి గూస్ బంప్స్ వస్తూ ఉంటాయని.. ఆ సమయంలోనే తను ఏం చేయాలి అనే విషయం గురించి ఆలోచిస్తానని ఎన్టీఆర్ తెలియజేశారు.. మొత్తానికైతే ఒక చిన్న యాక్సిడెంట్ తనలో రాజకీయంగా కూడా ఆలోచించేలా చేసి తనను మరింత ఉన్న స్థాయికి తీసుకు వచ్చిందని తెలిపారు ఎన్టీఆర్..

ఎన్టీఆర్ సినిమాలు..

ఎన్టీఆర్ సినిమాల విషయానికొస్తే ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచ స్థాయి గుర్తింపును సొంతం చేసుకున్న ఈయన.. ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు.. ఈ సినిమా తర్వాత బాలీవుడ్ లో హృతిక్ రోషన్ నటిస్తున్న వార్ -2 చిత్రం లో విలన్ గా నటించడమే కాకుండా ఆ సినిమా ద్వారా బాలీవుడ్ లో సక్సెస్ అయ్యే దిశగా అడుగులు వేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు