Samyukta : ఆరెంజ్ డ్రెస్ లో ఓరేంజ్ లో అట్రాక్ట్ చేస్తున్న కేరళకుట్టి..

Samyukta : కేరళ కుట్టి సంయుక్త మీనన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. భీమ్లా నాయక్ చిత్రంలో రానా వైఫ్ గా కీలక పాత్రతో పరిచయమైన ఈ బ్యూటీ ఆ తర్వాత తన గ్లామర్ తో పాటు యాక్టింగ్ తో మూవీ లవర్స్ ని తన వైపు తిప్పుకుంది. ఆ వెంటనే కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన బింబిసార సినిమాలో హీరోయిన్ గా నటించి మెప్పించింది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక లాస్ట్ ఇయర్ ధనుష్ నటించిన ‘సార్’ చిత్రంతో మరో బ్లాక్ బస్టర్ విజయాన్ని కూడా అందుకుంది. ఈ సినిమా తమిళ్, తెలుగులో రెండిట్లోనూ సక్సెస్ అయిందన్న విషయం తెలిసిందే. అలాగే సంయుక్త సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన విరూపాక్ష సినిమాతో కూడా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ఇక ఈ సినిమాలో సంయుక్త నందిని అనే పాత్రలో నటించగా, క్లైమాక్స్ లో తనదైన నటనతో మెప్పించి హీరోని మించి మార్కులు కొట్టేసింది. ఇక ఈ సినిమానే కాక సంయుక్త కళ్యాణ్ రామ్ సినిమా డెవిల్ తో డిసెంబర్ లో పలకరించగా, ఆ సినిమా అంతగా ఆడలేదు. కానీ ఈ అమ్మడికి మాత్రం వరుస అవకాశాలు వచ్చాయి.

ఆరెంజ్ డ్రెస్ లో అందాల సోయగం..

అయితే సంయుక్త లాస్ట్ ఇయర్ కళ్యాణ్ రామ్ డెవిల్ సినిమాలో నటించాక మళ్ళీ వేరే సినిమాలో కనిపించలేదు. ఒక్క తెలుగులోనే కాదు ఇత్స్ర భాషల్లోనూ నటించలేదు. కానీ సోషల్ మీడియా లో మాత్రం యాక్టీవ్ గా ఉంటూ వస్తుంది. ఎప్పటికప్పుడు ఫోటోషూట్లతో రచ్చ చేస్తుంది. తాజాగా ఆరెంజ్ డ్రెస్ లో సంయుక్త చేసిన ఫోటోషూట్స్ ఇంస్టాగ్రామ్ లో ట్రెండ్ అవుతున్నాయి. చాలా సింపుల్ గా ఉన్న ఈ డ్రెస్ లో సంయుక్త తన కళతో అట్రాక్ట్ చేస్తుంది. మామూలుగా చాలా మంది హీరోయిన్లు గ్లామర్ షో తో ఫోటోషూట్లతో అట్రాక్ట్ చేస్తుంటారు. కానీ సంయుక్త మాత్రం ట్రెడిషనల్ గెటప్ లోనే ఓ రేంజ్ లో అట్రాక్ట్ చేస్తుంది. అయితే ఇలాంటి సింపుల్ పోస్ట్ లు, ఫోటోషూట్లతోనే సోషల్ మీడియా లో మూడు మిల్లియన్లకి పైగా ఫాలోవర్స్ ని సంపాదించింది సంయుక్త.

మలయాళం లోనే..

ఇక సంయుక్త(Samyukta) రీసెంట్ గా డెవిల్ సినిమాలో నటించాక మళ్ళీ ఏ సినిమాలోనూ నటించలేదు. మామూలుగా రెండు బ్లాక్ బస్టర్ సక్సెస్ లు వస్తే ఏ హీరోయిన్ అయినా అరడజను సినిమాలతో బిజీగా ఉంటుంది. కానీ సంయుక్త మాత్రం డెవిల్ తర్వాత మళ్ళీ ఇతర ప్రాజెక్ట్ లు అంగీకరించలేదు. కొన్ని ప్రాజెక్టులు హోల్డ్ లో పెట్టినట్టు సమాచారం. అయితే మలయాళంలో మోహన్ లాల్ నటిస్తున్న రామ్ అనే సినిమాలో మాత్రం నటిస్తుంది. కానీ అందులో హీరోయిన్ గా కూడా కాదని సమాచారం. బహుశా సెకండ్ లీడ్ గా లేదా కీలక పాత్రలో నటిస్తూ ఉండవచ్చు. ఇకపోతే సంయుక్త తెలుగు ఫ్యాన్స్ మాత్రం తెలుగులో సినిమాలు చేయట్లేదని ఫీలైపోతున్నారు. మరి ఈ కేరళకుట్టి తెలుగులో మళ్ళీ ఏ సినిమాతో కనిపిస్తుందో.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు