Tillu Square : టిల్లు గాని వారం రోజుల లెక్క.. డబుల్ రేంజ్..

Tillu Square : టాలీవుడ్ టాలెంటెడ్ యంగ్ హీరో సిద్దూ జొన్నలగడ్డ నటించిన టిల్లు స్క్వేర్ థియేటర్లలో అదరగొడుతున్నాడు. రిలీజ్ కి ముందే ఓ రేంజ్ హైప్ తో రచ్చ చేసిన టిల్లు గాడు రిలీజ్ అయ్యాక థియేటర్లలో దానికి మించి రచ్చ చేస్తున్నాడు. సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా నటించిన డీజే టిల్లు కి సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కిందన్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా సీక్వెల్ వస్తుందన్న విషయం తెలియగానే మినిమం ఇంపాక్ట్ ఉంటుందని అప్పట్లోనే ఆడియన్స్ అంచనా వేశారు. అయితే సీక్వెల్ కి డైరెక్టర్ మారాడని తెలియగా, పలు అనుమానాలు రేకెత్తాయి. కానీ రిలీజ్ తర్వాత ఆ డౌట్లన్నీ క్లియర్ చేసి సూపర్ హిట్ టాక్ తో బ్లాక్ బస్టర్ కలెక్షన్లతో సమాధానమిచ్చారు మేకర్స్. సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా నటించిన ఈ సినిమాకు సిద్ధుయే కథని అందించగా ఈ సీక్వెల్ ని దర్శకుడు మల్లిక్ రామ్ అద్భుతంగా తీసాడని చెప్పొచ్చు, ఫస్ట్ పార్ట్ కి ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుంది. కొంతమంది అంటున్నట్టు లాజిక్ ల గురించి పక్కన పెడితే టిల్లు గాడు ప్రేక్షకులని ఎంటర్టైన్ చేయడం లో మాత్రం సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు.

ఫస్ట్ వీక్ డబుల్ మార్జిన్..

ఇక టిల్లు స్క్వేర్(Tillu Square) ప్రీమియర్స్ నుండే పాజిటివ్ టాక్ తో ఓ రేంజ్ కలెక్షన్లు కొల్లగొట్టగా, వీకెండ్ లోనే బ్రేక్ ఈవెన్ అయిపోవడం విశేషం. ఇక తాజాగా మొదటి వారం కూడా సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకున్న ఈ సినిమా వర్కింగ్ డేస్ లో కూడా స్ట్రాంగ్ హోల్డ్ ని చూపించి భారీ కలెక్షన్లను రాబట్టింది. ఇక ఒక్కసారి టిల్లుగాని డీజే దందా తెలుగు రాష్ట్రాల్లో తెచ్చిన కలెక్షన్లు గమనిస్తే..

నైజాం 17.96 కోట్లు, సీడెడ్ 4.15 కోట్లు, ఉత్తరాంధ్ర 4.27 కోట్లు, ఈస్ట్ 2.13 కోట్లు, వెస్ట్ 1.27కోట్లు, గుంటూరు 1.83 కోట్లు, కృష్ణా 1.68 కోట్లు, నెల్లూరు: 1.02 కోట్లు సాధించగా, టోటల్ గా తెలుగు రాష్ట్రాల్లో 34.31కోట్ల షేర్ ని 56.35 కోట్ల గ్రాస్ ని వసూలు చేసింది. ఇక కర్ణాటక రెస్ట్ అఫ్ ఇండియా కలిపి 2.95 కోట్ల షేర్, అలాగే ఓవర్సీస్ లో 11.45 కోట్ల షేర్ ని వసూలు చేసిన టిల్లు స్క్వేర్ వరల్డ్ వైడ్ గా 48.71కోట్ల షేర్ 84.95 కోట్ల గ్రాస్ ని వసూలు చేసింది. ఇక టిల్లు స్క్వేర్ థియేట్రికల్ బిజినెస్ 27 కోట్ల వరకు ఉండగా, 28 కోట్ల టార్గెట్ తో రిలీజ్ కాగా, వచ్చిన వసూళ్ళని తీస్తే టిల్లు స్క్వేర్ 20.71 కోట్ల షేర్ ని అదనంగా సాధించి బ్లాక్ బస్టర్ నుండి ఆల్మోస్ట్ డబుల్ బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.

- Advertisement -

వంద కోట్ల దిశగా…

అయితే టిల్లు స్క్వేర్ ఫస్ట్ పార్ట్ క్రేజ్ తోనే టిల్లు స్క్వేర్ పై ఇంత అంచనాలు పెరగగా, ఆ అంచనాలను అందుకుని సినిమా భారీ హిట్ అయింది. ఇక రిలీజ్ కి ముందే నిర్మాత నాగ వంశి తమ సినిమా వంద కోట్లు కోళ్ల గొడుతుంది అన్నారు. అందుకున్నట్టుగానే టిల్లు స్క్వేర్ సినిమా వంద కోట్ల కలెక్షన్స్ దిశగా పరుగులు పెడుతుంది. రెండో వారంలో కూడా స్ట్రాంగ్ గా థియేటర్లను హోల్డ్ చేసిన టిల్లు స్క్వేర్ థియేటర్లలో రెండో వీకెండ్ ముగిసే లోగా వంద కోట్ల లాంఛనాన్ని కూడా పూర్తిచేస్తుందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఈ వారం ఫ్యామిలీ స్టార్ రిలీజ్ అయినప్పటికీ టిల్లు స్క్వేర్ కి మాస్ థియేటర్లలో బుకింగ్ చాలా బాగా జరుగుతున్నాయి. ఇక టిల్లు స్క్వేర్ మూడో పార్ట్ గా టిల్లు క్యూబ్ వస్తుందని వార్తలు వస్తున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు