Rajamouli : వందల కోట్ల ఆస్తి.. కానీ సామాన్య జీవితం..ఆ పిచ్చే కారణమా..?

Rajamouli : తెలుగు చలనచిత్ర పరిశ్రమలో దిగ్గజ దర్శకుడిగా ఎంతో మంచి పేరు దక్కించుకున్నారు ఎస్.ఎస్.రాజమౌళి.. మొదట బుల్లితెరపై కెరియర్ ప్రారంభించి.. ఆ తర్వాత బుల్లితెర సీరియల్స్ కి ఎపిసోడ్ డైరక్టర్ గా పనిచేశారు. అలా చేస్తున్న సమయంలోనే ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాకి దర్శకత్వం వహించే అవకాశం రావడంతో.. తనలోని టాలెంట్ ని ఉపయోగించి.. డైరెక్టర్గా ప్రేక్షకుల ముందుకు వచ్చి.. ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు.అంతేకాదు దర్శకుడిగా రాజమౌళికి ఈ సినిమా మంచి పేరు కూడా తీసుకొచ్చింది.ఈ సినిమా తర్వాత వరుసగా స్టార్ హీరోలతో పని చేసే అవకాశాలు కూడా లభించాయి..

భారీగా సంపాదన..

ఇప్పటివరకు రాజమౌళి తన సినీ కెరియర్లో కేవలం 12 సినిమాలకు మాత్రమే దర్శకత్వం వహించారు. ఈయన దర్శకత్వం వహించింది తక్కువ సినిమాలే అయినా ఈ సినిమాలు మాత్రం సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. అంతేకాదు అంతర్జాతీయ స్థాయిలో దర్శకుడిగా ఆయనకు పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టాయి.. ఇప్పటివరకు తెలుగు చిత్ర పరిశ్రమకు రానటువంటి గోల్డెన్ గ్లోబ్, ఆస్కార్ వంటి అవార్డులు కూడా రాజమౌళితోనే సాధ్యమయ్యాయని చెప్పవచ్చు. ఈయన ఒక్కో సినిమాకు భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ తో పాటు భారీ స్థాయిలోనే లాభాలలో వాటాలు కూడా తీసుకుంటారు. అంతే కాదు అంతకుమించి ఆస్తులను కూడా పోగు చేసినట్లు సమాచారం..

రాజమౌళి ఆస్తులు..

పలు నివేదికల ప్రకారం రాజమౌళి ( Rajamouli ) సుమారు రూ.350 కోట్లకు పైగా ఆస్తులను కూడబెట్టారని తెలుస్తోంది. ఇలా వందల కోట్ల ఆస్తి ఉండి, స్టార్ సెలబ్రిటీ హోదా అనుభవించేవారు తరచూ పెద్ద ఎత్తున పార్టీలు, పబ్ లు అంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు.. కానీ రాజమౌళి మాత్రం ప్రతి రూపాయికి చాలా విలువ ఇస్తారు. ఈయన సంపాదించింది మొత్తం సేవింగ్స్ మాత్రమే చేస్తారని తాజాగా తెలుస్తోంది.. ఇలా కోట్లు సంపాదించినప్పటికీ కూడా ఆయన ఏ రోజు కూడా పబ్బులకు , పార్టీలకు అంటూ ఒక రూపాయి కూడా ఖర్చు చేయరట.

- Advertisement -

ఆ పిచ్చి వల్లే ఆడంబరాలకు దూరం..

మనం ఎంతో కష్టపడి సంపాదించినటువంటి డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వాలి అన్న ఉద్దేశంతోనే ఈయన ఎటువంటి ఖర్చులు చేయకుండా ఆ డబ్బుని ఆదా చేస్తూ ఉంటారట. రాజమౌళి ఇలా ఆలోచిస్తారు కాబట్టే నేడు ఈ స్థాయిలో ఉన్నారని చెప్పవచ్చు.. వాస్తవానికి మనిషి అన్న తర్వాత జీవితంలో ఒక్కరోజైనా సంతోషం, ఎంటర్టైన్మెంట్ అనేది ఉండాలి. కానీ రాజమౌళికి మాత్రం అవేవీ పట్టవు.. అందుకే అన్నిటికీ దూరంగా ఉంటూ సినిమానే ప్రపంచంగా బ్రతుకుతున్నారు. ఇక రాజమౌళికి సినిమా అంటే ఎంత పిచ్చి ఉందో ఆయనతో పని చేసిన ఎంతోమంది సెలబ్రిటీలు చెబుతూ ఉంటారు.. ఇక ఆ పిచ్చి వల్లే ఆయన ఆడంబరాలకి దూరంగా ఉంటారు. మొత్తానికైతే ఎంత డబ్బు ఉన్నా సింప్లిసిటీకే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు రాజమౌళి..

రాజమౌళి సినిమాలు..

ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో యాక్షన్ అడ్వెంచర్ మూవీని తెరకెక్కించబోతున్నారు.. ప్రస్తుతం ఈ సినిమాను పాన్ వరల్డ్ మూవీ గా ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే.. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు