HBD Rashmika : గీత నుండి గీతాంజలి దాకా..

HBD Rashmika : టాలీవుడ్ లో ఛలో అనే చిన్న సినిమాతో హీరోయిన్ గా పరిచయమై ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించిన అందాల భామ రష్మిక మందన్న. కన్నడ నేలకు చెందిన ఈ సోయగం ముందుగా కన్నడలోనే పరిచయమైనా స్టార్ హీరోయిన్ అయింది మాత్రం తెలుగు సినిమాలతోనే. గీతా గోవిందంతో రష్మిక స్టార్ హీరోయిన్ అయినా ముందుగా ఛలో సినిమాలో చూసి చూడంగానే.. అనే పాటతోనే యూత్ మనస్సులో చొచ్చుకుపోయింది. ఆ పాటకి తగ్గట్టే యువతలో చూసి చూడంగానే క్రష్ లిస్ట్ లో చేరిపోయింది. అయితే గీతా గోవిందం లో చేసిన గీత పాత్ర మాత్రం మరో ఎత్తు. అప్పటివరకు గ్లామర్ ప్రాధాన్యం ఉన్న సాదా సీదా రోల్స్ చేసిన ఈ అమ్మడు గీత గా హీరోని ముప్పు తిప్పలు పెట్టే కన్నింగ్ పాత్ర లో అద్భుతంగా నటించింది. అంతే అద్భుతంగా ఆ సినిమా నుండి విజయ్ తో రియల్ లైఫ్ లోనూ ప్రేమలో పడిందని అంటుంటారు సినీ ప్రియులు.

రష్మిక నుండి క్రష్మిక గా…

గీతా గోవిందం తో బ్లాక్ బస్టర్ కొట్టిన రష్మిక అక్కడినుండి తెలుగుతో పాటు సౌత్ మొత్తం సినిమాలు చేసింది. సరిలేరు నీకెవ్వరూ, వారిసు, భీష్మ, యజమాన, సుల్తాన్ వంటి సినిమాల్లో స్టార్ హీరోలతో నటించి మెప్పించింది. అంతే కాదు అతి తక్కువ సినిమాలతో సౌత్ లోయ బిజీ స్టార్ హీరోయిన్ అయిపొయింది. అయితే రష్మిక కు నేషనల్ వైడ్ గా పేరు తెచ్చి, ఇండియా లోని యూత్ మనస్సులో రష్మిక మందన్న క్రష్మిక గా మారింది మాత్రం “పుష్ప ది రూల్” సినిమాతోనే. రష్మిక కెరీర్ లో ఫస్ట్ పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయిన పుష్ప లో శ్రీ వల్లి గా తన నటనతో పాటు గ్లామర్ షో తో మెప్పించింది. పల్లెటూరి అమ్మాయి శ్రీవల్లిగా తన చలాకీతనం తో పాటు పెర్ఫార్మన్స్ తో యూత్ కి మతి పోగొట్టింది. ఈ సినిమాతోనే రష్మిక ని నేషనల్ క్రష్ అనడం స్టార్ట్ చేసారు. ముఖ్యంగా బాలీవుడ్ జనాలు రష్మిక కి ఫిదా అయిపోయారు. ఆ మధ్య బాలీవుడ్ లో రష్మిక ఎక్కడ సందడి చేసినా పుష్ప పాటలే వైరల్ అయ్యాయి. ఇక ఈ సినిమాతో రష్మిక బాలీవుడ్ లో కూడా భారీ ఆఫర్లు అందుకుంది.

గీత నుండి గీతాంజలిగా..

టాలీవుడ్ లో కొన్నాళ్ల పాటు రష్మిక గ్యాప్ ఇచ్చేసరికి ఫేడవుట్ అవుతుందని అనుకున్నారు చాలా మంది. కానీ అదే సమయంలో బాలీవుడ్ లో వరుస సినిమాలతో తన హవా చాటింది. పుష్ప తర్వాత బాలీవుడ్ లో ఆఫర్లు బాగా వచ్చాయి. గుడ్ బాయ్, మిషన్ మజ్ను సినిమాలలో నటించినా, రష్మిక లాస్ట్ ఇయర్ నటించిన అనిమల్ తో వచ్చిన క్రేజ్ వేరే లెవెల్ అని చెప్పాలి. ఈ సినిమాలో రణబీర్ కపూర్ కి ఎంత గుర్తింపు వచ్చిందో, అంతే పేరు రష్మిక కి కూడా గుర్తింపు వచ్చింది. గీతాంజలి గా ఈ సినిమాలో రష్మిక తన ఇంటెన్స్ పెర్ఫార్మన్స్ తో, తన కళ్ళతోనే హావ భావాలు పలికించి అదరగొట్టింది. ఇక ఇప్పుడు వరుస సినిమాలతో తన సత్తా చాటుతూ ముందుకు పోతుంది. ఇప్పుడు రాబోయే పుష్ప ది రూల్ లో అల్లు అర్జున్ ని మించిన వైలెన్స్ తో రష్మిక పాత్ర ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ఇక ఈరోజు నేషనల్ క్రష్ రష్మిక మందన్న(HBD Rashmika) (05 ఏప్రిల్ 1996)పుట్టిన రోజు. ఈ సందర్బంగా filmify తరపున రష్మిక కి బర్త్ డే విషెస్ తెలుపుతూ, రాబోయే క్రేజీ సినిమాలతో ఆడియన్స్ ని మరింత అలరించాలని కోరుతున్నాం.

- Advertisement -

ఇక రష్మిక మందన్న తన బర్త్ డే సెలెబ్రేషన్స్ ని యూఏఈ లో జరుపుకుంటుంది. ఇక ఈ సెలెబ్రేషన్స్ కి విజయ్ దేవరకొండ వెళ్తున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇక రష్మిక ప్రస్తుతం తెలుగులో పుష్ప ది రూల్, ది గర్ల్ ఫ్రెండ్, కుబేర, రెయిన్ బో, తో పాటు బాలీవుడ్ లో చావా అనే సినిమాలో నటిస్తుంది. ఇక బర్త్ డే సందర్బంగా మరిన్ని కొత్త సినిమాల అప్డేట్స్ వచ్చే అవకాశం ఉంది.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు