Prabhas Wishes : ఫ్యామిలీ స్టార్ సినిమాకు డార్లింగ్ విషెస్

Prabhas Wishes : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ప్రభాస్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈశ్వర్ సినిమాతో తెలుగు ఫిలిమ్ ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ అతి కొద్ది కాలంలోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకుని హీరోగా తనను తాను నిలదొక్కుకున్నాడు. శోభన్ దర్శకత్వం వహించిన వర్షం సినిమా ప్రభాస్ కి మంచి గుర్తింపును తీసుకొచ్చింది. ఈ సినిమాలో గోపీచంద్ విలన్ గా కూడా కనిపించాడు. ఈ సినిమాతోనే వీరిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ కూడా మొదలైంది అని చెప్పొచ్చు.

ప్రభాస్ ఎన్ని సినిమాలు చేసినా కూడా ప్రభాస్ కు ప్రత్యేకమైన స్టార్డం తీసుకొచ్చిన సినిమా అంటే ఛత్రపతి అని చెప్పొచ్చు. ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి హిట్ టాక్ సాధించి మంచి వసూళ్లను రాబట్టింది. ఆ తర్వాత ప్రభాస్ చేసిన కొన్ని సినిమాలు ఫ్యామిలీ ఆడియన్స్ కి ప్రభాస్ ని దగ్గర చేశాయి. ప్రభాస్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రెండు సినిమాలు చేశాడు. దానిలో ఒకటి బుజ్జి గాడు, రెండు ఏక్ నిరంజన్.

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో బుజ్జిగాడు సినిమా షూటింగ్ జరుగుతున్న టైంలో ప్రభాస్ పూరి జగన్నాథ్ ని డార్లింగ్ అంటూ పిలవడం మొదలు పెట్టాడు. అయితే నన్ను మాత్రమే డార్లింగ్ అంటున్నాడు అని పూరి జగన్నాథ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అయితే కొంతకాలం తర్వాత ప్రభాస్ అందరిని కూడా డార్లింగ్ అని పిలుస్తాడని రియలైజ్ అయ్యాడు. ఇకపోతే అదే టైటిల్ తో కరుణాకర్ డార్లింగ్ అనే సినిమాను తెరకెక్కించాడు. సినిమాలో ప్రభాస్ సరసన కాజల్ అగర్వాల్ నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన హిట్ అయింది.

- Advertisement -

ఈ సినిమా తర్వాత ప్రభాస్ చేసిన సినిమా మిస్టర్ పర్ఫెక్ట్. ఈ సినిమా ప్రభాస్ ను ఫ్యామిలీ ఆడియన్స్ కు మరింత దగ్గర చేసింది. ఆ తర్వాత రాఘవ లారెన్స్ దర్శకత్వంలో వచ్చిన రెబల్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అట్టర్ ప్లాప్ గా మారింది. ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమా ప్రభాస్ ని పాన్ ఇండియా హీరోని చేసేసింది. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపును తీసుకొచ్చింది. ప్రస్తుతం ప్రభాస్ నుంచి ఒక సినిమా వస్తుంది అని అంటే ప్రపంచం అంతటి నుంచి ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు అనడంలో అతిశయోక్తి లేదు.

అయితే ప్రభాస్ కు ఉన్న స్టార్డం గురించి ఇప్పుడు ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇకపోతే కొందరు జీవితంలో ఎదిగేకొద్దీ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అని విషయాన్ని మర్చిపోయి ఉంటారు. కానీ ఈ విషయంలో ప్రభాస్ మాత్రం చాలా మందికి ఆదర్శం అని చెప్పొచ్చు. ఎందుకంటే చిన్న సినిమా రిలీజ్ అయిన పెద్ద సినిమా రిలీజ్ అయిన ఆ సినిమాకి ఆల్ ది బెస్ట్ చెబుతూ తన ఇన్స్టాగ్రామ్ వేదికగా స్టోరీని షేర్ చేయడం ప్రభాస్ కి అలవాటు. ఏ సినిమా రిలీజ్ అయిన కూడా ఆ సినిమాకి ప్రభాస్ విషెస్ ( Prabhas Wishes ) తెలియజేస్తాడు. ఏప్రిల్ 5న ప్రేక్షకులు ముందుకు రాబోతున్న ఫ్యామిలీ స్టార్ సినిమాకి కూడా తన విషెస్ తెలియజేశాడు ప్రభాస్.

ఇకపోతే ఇంస్టాగ్రామ్ వేదికగా ప్రభాస్ కొన్ని సినిమాలను ప్రోమోషన్ చేస్తే ట్విట్టర్ వేదికగా సాయిధరమ్ తేజ్ కూడా కొన్ని సినిమాలకు సపోర్ట్ చేస్తూ వస్తాడు. ఇండస్ట్రీలో ఏ సినిమా రిలీజ్ అయినా కూడా వీరిద్దరూ ఆ సినిమాను ప్రేక్షకులు ముందుకు తీసుకెళ్లడానికి వాళ్ళ వంతు సహాయ పడతారు. నిజంగా వీళ్ళని జెన్యూన్ సినిమా లవర్స్ అని చెప్పొచ్చు. బహుశా అందుకనేమో ప్రభాస్ ని అందరూ డార్లింగ్ అని పిలుస్తారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు