HBD Rashmika : రష్మిక గురించి ఈ విషయాలు మీకు తెలుసా..?

HBD Rashmika : తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతున్న హీరోయిన్ రష్మిక.. మొదట ఛలో అనే చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయింది… అయితే ఈమె కెరియర్ కు మైలురాయిగా నిలిచిన చిత్రం గీతా గోవిందం.. ఆ తర్వాత కెరియర్ పరంగా వెనక్కి తిరిగి చూసుకోలేదు రష్మిక.. వరుసగా స్టార్ హీరోల సినిమాలో అవకాశాలు అందుకున్న ఈ ముద్దుగుమ్మ పాన్ ఇండియా హీరోయిన్ గా పేరు సంపాదించింది.. కన్నడ సినీ పరిశ్రమ నుంచి కెరీర్ ను ప్రారంభించిన ఈమె అటు బాలీవుడ్ , ఇటు టాలీవుడ్ లో కూడా పాగా వేసింది.. ఈ రోజున రష్మిక 28వ పుట్టినరోజు ( HBD Rashmika ) జరుపుకుంటున్న సందర్భంగా ఆమె గురించి తెలియని కొన్ని విషయాలను చూద్దాం.

రష్మిక కెరియర్..

రష్మిక 1996 ఏప్రిల్ 5న కర్ణాటక ప్రాంతంలో విరాజ్ పేట గ్రామంలో జన్మించింది.. ఈమె తల్లి పేరు సుమన్ మందన్న.. తండ్రి పేరు మదన్ మందన్న.. రష్మికా కు ఒక చెల్లెలు కూడా ఉన్నది. రష్మిక సైకాలజీ జర్నలిజంలో బ్యాచిలర్ డిగ్రీ ని పూర్తి చేసింది. అయితే నటన పైన ఇష్టంతో మోడలింగ్ రంగం వైపు అడుగుపెట్టిన రష్మిక మొదటిసారి క్లీన్ అండ్ క్లియర్ అనే పేస్ క్రీమ్ యాడ్ లో నటించింది. దీంతో బ్రాండ్ అంబాసిడర్ గా ఈ బ్రాండ్ కి మారిపోయింది రష్మిక.

శాండిల్‌వుడ్ ఎంట్రీ

మోడలింగ్ లో రాణిస్తున్న సమయంలో ఇంటర్వ్యూలలో పాల్గొన్న రష్మిక హీరోయిన్ అవ్వాలనే కోరికను బయటపెట్టింది. ఆ సమయంలో కాంతారా ఫేమ్ డైరెక్టర్ రిషబ్ శెట్టి తాను తెరకెక్కిస్తున్న కిరాక్ పార్టీ సినిమా లో హీరోయిన్ కోసం అన్వేషిస్తున్న సమయంలో రష్మిక ఇంటర్వ్యూ ను చూసి ఆమెను సంప్రదించారట.. అవకాశం వచ్చిన వెంటనే రష్మిక కూడా వెంటనే ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. అలా 2016 లో విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్న రష్మికకు శాండిల్ వుడ్ లో కూడా పలు అవకాశాలు వచ్చాయి.. అక్కడ కూడా స్టార్ హీరోల సినిమాలలో నటించింది.

- Advertisement -

టాలీవుడ్ ఎంట్రీ..

టాలీవుడ్ లోకి నాగశౌర్య నటించిన ఛలో సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.. గీత గోవిందం సినిమాతో స్టార్ డం ను అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఈ సినిమాతో మొదటిసారి రూ .100 కోట్ల క్లబ్ లోకి చేరింది. దీంతో రష్మిక టాలీవుడ్ లో లక్కీ హీరోయిన్ గా పేరు సంపాదించింది.. ఆ తర్వాత నటించిన డియర్ కామ్రేడ్ సినిమా ఫ్లాప్ గా నిలిచింది.. అయితే ఆ తర్వాత సరిలేరు నీకెవ్వరు, భీష్మ లాంటి చిత్రాలతో మళ్లీ భారీ క్రేజ్ అందుకుంది. మరోవైపు కోలీవుడ్ లో మొదటిసారి కార్తీక్ సరసన సుల్తాన్ సినిమాలో నటించినా.. ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.. ఇప్పుడు అల్లు అర్జున్ తో వచ్చిన పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో పేరు సంపాదించింది ఈ ముద్దుగుమ్మ..

బాలీవుడ్ ఎంట్రీ..

బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్ తో కలిసి గుడ్ బై అనే సినిమాలో నటించింది.. ఈ సినిమా ఫ్లాప్ అయినా గత ఏడాది రణబీర్ కపూర్ తో కలసి నటించిన యానిమల్ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. దీంతో పాన్ ఇండియా హీరోయిన్ గా మరొకసారి క్రేజ్ అందుకుంది..

రష్మిక అప్ కమ్మింగ్ మూవీస్…

రష్మిక నేషనల్ క్రష్ గా కూడా బిరుదు అందుకుంది.. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగిన వారిలో రష్మిక కూడా ఒకరు.. ఎన్నో రకాల అవార్డులను కూడా అందుకుంది. నాలుగు సైమా అవార్డులు కూడా అందుకుంది రష్మిక.. మిడిల్ క్లాస్ కుటుంబం నుంచి వచ్చిన రష్మిక ఫోర్బ్స్ జాబితాలో కూడా అవకాశాన్ని అందుకుంది. ప్రస్తుతం పుష్ప-2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నది.. అలాగే ధనుష్ తో ఒక సినిమా, రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ది గర్ల్ ఫ్రెండ్ సినిమాలో కూడా నటిస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు