Thalaivar 171 : ఆ సినిమా నుంచి ఇన్స్పిరేషన్.?

Thalaivar 171 : ఏ ఇండస్ట్రీలో అయిన ప్రతి దర్శకుడు ఒక సినిమాను స్టార్ట్ చేస్తున్నప్పుడు. ఒక కథను ఎక్కడో ఒకచోట నుంచి ఇన్స్పైర్ అవ్వటం అనేది సర్వసాధారణం. ప్రతి కథ కూడా ఊహల్లోంచి, అనుభవంలోంచి పుస్తకాల్లోంచి పుడుతుంది అని చెప్పొచ్చు. చాలా సినిమాలకి ఇన్స్పిరేషన్ ఉంటూనే ఉంటుంది. తెలుగు దర్శకులు అయితే ఒకప్పుడు పది హాలీవుడ్ సినిమాలు చూసి ఒక తెలుగు కథ రాసుకునేవాళ్ళు. ఇప్పుడు దానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే అందరూ ఆడియన్స్ కూడా అన్ని భాషల్లో సినిమాలను చూడగలుగుతున్నారు.

చాలామంది తెలుగు దర్శకులు పుస్తకాల నుంచి ఇన్స్పైర్ అయి చాలా సినిమాలు చేశారు. అలానే వేరే భాషలో రిలీజ్ అయిన సినిమాలను తెలుగులో కూడా రీమేక్ చేసి విజయం సాధించారు. తెలుగులో చాలా సినిమాలు హాలీవుడ్ నుంచి ఇన్స్పిరేషన్ గా తీసుకొని చేశారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాల్లో కొన్ని కొన్ని సీన్స్ హాలీవుడ్ నుంచి ఇన్స్పైర్ అయ్యి చేసినట్లు అనిపిస్తూ ఉంటాయి.

కేవలం త్రివిక్రమ్ శ్రీనివాస్ మాత్రమే కాకుండా రాజమౌళి, సుకుమార్ వంటి దర్శకులు కూడా హాలీవుడ్ సినిమాలను చూసి ఇన్స్పైర్ అయ్యి తెలుగులో కొన్ని సీన్స్ చేశారు అని చెప్పొచ్చు. ఇకపోతే మానగరం అనే సినిమాతో దర్శకుడుగా తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీకి దర్శకుడుగా పరిచయమయ్యాడు లోకేష్ కనగరాజ్. తన మొదటి సినిమాతోనే అద్భుతమైన ఘనవిజయాన్ని సాధించి దర్శకుడుగా నిలబడ్డాడు.

- Advertisement -

అయితే మానగరం సినిమా తెలుగులో నగరం పేరుతో రిలీజ్ అయింది. సందీప్ కిషన్ నటించిన ఈ సినిమా తెలుగులో కూడా మంచి రెస్పాన్స్ ను సాధించింది. ఈ సినిమాలో సందీప్ కిషన్ కి జంటగా రెజీనా కసాండ్రా నటించింది. ఈ సినిమా తర్వాత లోకేష్ కనకరాజ్ చేసిన సినిమా ఖైదీ. ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. కేవలం ఒక రాత్రి ప్రయాణాన్ని ఎంతో ఆసక్తికరంగా అద్భుతంగా ఆడియన్స్ ను కూర్చుని పెట్టి మరి చూపించాడు.

ఖైదీ సినిమా తర్వాత లోకేష్ కనకరాజ్ నుంచి ఒక సినిమా వస్తుంది అని అంటే ఆ ఎక్స్పెక్టేషన్స్ వేరే రేంజ్ కి వెళ్ళిపోయాయి. లోకేష్ దర్శకత్వంలో వచ్చిన మాస్టర్ సినిమా కూడా పరవాలేదు అనిపించుకుంది. విజయ్ ను, విజయ్ సేతుపతి ను ఆ సినిమాలో చూపించిన విధానం అద్భుతంగా వర్కౌట్ అయింది. ఆ తర్వాత కమల్ హాసన్ తో చేసిన విక్రమ్ సినిమా ఒక సంచలనానికి తెర తీసింది. దాదాపు 500 కోట్లకు పైగా వసూళ్లను చేసింది. విక్రమ్ సినిమా తర్వాత మళ్లీ లియో అనే సినిమాను చేశాడు లోకేష్. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టింది.

లోకేష్ ఫిలిం మేకింగ్ స్టైల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం రజనీకాంత్ తో 171 ( Thalaivar 171  ) వ సినిమాని చేయనున్నాడు లోకేష్ కనగరాజ్. అయితే హాలీవుడ్ లో వచ్చిన The Purge అనే సినిమాకి ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఈ సినిమాను లోకేష్ తెరకెక్కిస్తున్నట్లు సమాచారం వినిపిస్తుంది. ఇకపోతే పర్జ్ సినిమా ప్లాట్ విషయానికి వస్తే అమెరికన్ ప్రభుత్వం 12 గంటల వ్యవధిని మంజూరు చేస్తుంది, ఇందులో హత్యతో సహా అన్ని నేర కార్యకలాపాలు లీగల్ అవుతాయి. పోలీసులను పట్టించుకోరు. ఆసుపత్రులు సహాయాన్ని నిలిపివేస్తాయి. దీనిని ఇన్స్పైర్ అయ్యి రజనీకాంత్ 171 మూవీ చేయబోతున్నట్లు సమాచారం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు