Pavitra Lokesh : ఆస్తి కోసమే నరేష్ తో పవిత్ర లోకేష్ రిలేషన్.. నిజమేనా..?

Pavitra Lokesh..టాలీవుడ్ లో సీనియర్ హీరో నరేష్ ఇప్పటికి పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ బిజీగా ఉన్నారు.. ఈ మధ్యకాలంలో సీనియర్ నటుడు నరేష్ నటించిన ఎన్నో చిత్రాలు కూడా కమర్షియల్ గా మంచి విజయాలను అందుకుంటున్నాయి.. గడచిన కొన్నేళ్ల క్రితం నుంచి నటి పవిత్ర లోకేష్ తో రిలేషన్ షిప్ లో ఉండడం వల్ల వీరి గురించి పలు రకాల వార్తల ఇప్పటికి వినిపిస్తూనే ఉంటాయి. ఇప్పుడు తాజాగా పవిత్ర లోకేష్ మాజీ భర్త సుచేంద్ర మరొకసారి పవిత్ర లోకేష్ గురించి పలు సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.

పవిత్ర లోకేష్ పై సుచేంద్ర షాకింగ్ కామెంట్స్..

పవిత్ర లోకేష్ ( Pavitra Lokesh ) పైన మాజీ భర్త సుచేంద్ర మాట్లాడుతూ.. లగ్జరీ లైఫ్, డబ్బుల కోసం మాత్రమే పవిత్ర లోకేష్ నరేష్ తో రిలేషన్ లో ఉందంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.. డబ్బుల కోసం పవిత్ర లోకేష్ ఎలాంటి పని చేయడానికి అయినా వెనుకాడదు అంటూ కూడా సుచేంద్ర వెల్లడించారు.. నరేష్ ఆస్తి విలువ సుమారుగా 1500 కోట్ల రూపాయలు ఉంటుంది.. అది గుర్తించిన పవిత్ర లోకేష్.. నరేష్ వయసు 60 సంవత్సరాల కంటే ఎక్కువగా ఉన్నప్పటికీ.. డబ్బు కోసమే తనతో రిలేషన్ కొనసాగిస్తోంది అంటూ అందుకు కారణం డబ్బే అంటూ సుచేంద్ర వెల్లడించారు..

నరేష్ – పవిత్ర పెళ్లి కి ఆలస్యం..

ప్రస్తుతం పవిత్ర లోకేష్ మాజీ భర్త చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.. ఇప్పటివరకు పవిత్ర లోకేష్ పెళ్లి గురించి పలు రకాల వార్తలయితే వినిపించాయి కానీ ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు.. ముఖ్యంగా నరేష్ తన మూడో భార్య నుంచీ విడాకులు రాకపోవడంతో.. పవిత్ర తో పెళ్లి కాస్త ఆలస్యం అవుతోందనే వార్తలు వినిపిస్తున్నాయి.. నరేష్ , పవిత్ర లోకేష్ జోడీ గురించి ప్రేక్షకులకు భిన్నమైన అభిప్రాయాలు ఉన్నప్పటికీ మరి కొంతమంది ఈ జోడిని చూస్తే విమర్శిస్తూ ఉంటారు..

- Advertisement -

నరేష్ కెరియర్..

గతంలో హీరోగా నటించిన నరేష్ ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను బాగా అలరిస్తున్నారు.. ముఖ్యంగా చిన్న పెద్ద అనే సినిమాలతో సంబంధం లేకుండా పాత్ర బలంగా ఉంటే కచ్చితంగా నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు.. అందుకే నటన పరంగా నరేష్ కి ఎప్పుడు మంచి గుర్తింపు ఉంటుంది అనడంలో సందేహం లేదు.. అలాగే రెమ్యునరేషన్ పరంగా కూడా నరేష్ ప్రస్తుతం ఉన్న నటులలో టాప్ లో ఉన్నారని తెలుస్తోంది..

వివాదాలలో నరేష్..

ఇదిలా ఉండగా మరోవైపు సీనియర్ నరేష్ ఎప్పుడు కూడా వివాదాస్పదమైన కామెంట్లలో నిలుస్తూ ఉంటారు.. మరి రాబోయే రోజుల్లో నరేష్ మరిన్ని సినిమాలలో నటించి మంచి విజయాలని అందుకోవాలని అభిమానులైతే కోరుకుంటున్నారు. మరి రాబోయే రోజుల్లో నరేష్ ఎలాంటి సినిమాలు తో ప్రేక్షకులను మెప్పిస్తారు చూడాలి..

మొత్తానికైతే పవిత్ర లోకేష్ పై ఆమె మాజీ భర్త సుచేంద్ర పైన నరేష్ ఎలా స్పందిస్తారో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు