Sita Ramam : మళ్ళీ కలవనున్న రామ్ సీత?

Sita Ramam : టాలీవుడ్ లో రెండేళ్ల కింద రిలీజ్ అయిన అద్భుత ప్రేమకావ్యం “సీతారామం” సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. అభిరుచి గల దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం గొప్ప ప్రేమ కథా చిత్రం గా అప్పటి సీతారాముల ప్రేమబంధాన్ని ఇప్పటి కాలానికి మార్చి తీసినట్టుగా అనిపిస్తుంది. మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ మృణాల్ థాకూర్ జంటగా నటించిన ఈ చిత్రానికి తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. తెలుగులో వచ్చిన బెస్ట్ మూవీస్ లో ఒకటిగా కల్ట్ క్లాసిక్ గా ఆడియన్స్ తో పాటు ట్రేడ్ విశ్లేషకులు అభివర్ణిస్తుంటారు. సినిమాలో ఒక్క అభ్యంతకర సీన్ కూడా పెట్టకుండా చిన్నా పెద్దా అందరూ చూసేలా తీసిన ఈ చిత్రానికి సీక్వెల్ కూడా తీయాలని చాలా మంది ప్రేక్షకుల కోరిక.

బెస్ట్ పెయిర్ గా మృణాల్ దుల్కర్..

ఇక ఈ సినిమాలో హీరోహీరోయిన్లు గా నటించిన దుల్కర్ సల్మాన్ అలాగే మృణాల్ థాకూర్ తమ కెరీర్ లోనే అత్యుత్తమ నటన కనబరిచారని చెప్పొచ్చు. ఏ ముహూర్తాన దర్శకుడు హను ఈ సినిమాలో వీళ్ళ పాత్రలు రామ్ సీత అని పెట్టాడో కానీ, ప్రేక్షకులు వీళ్ళని నిజంగానే ఆ పాత్రలతోనే పిలవడం స్టార్ట్ చేసారు. ఆ రేంజ్ లో వీళ్ళ పాత్రలు జనాల మనసుల్ని హత్తుకున్నాయి. అంతే కాదు ఈ సినిమా క్లైమాక్స్ లో వీళ్ళ పాత్రలు ఎండింగ్ తో కన్నీళ్లు పెట్టుకొని సినీ ప్రేక్షకులు ఉండరు. అయితే అప్పట్నుంచి వీళ్ళ పాత్ర సినిమాలో అసంపూర్ణమైందని, మంచి ఎండింగ్ ఇచ్చేట్టు వీళ్ళ కాంబోలో మళ్ళీ సీక్వెల్ తీయాలని మేకర్స్ కి ఎన్నో రిక్వెస్ట్ లు ఫ్యాన్స్ నుండి వచ్చాయి. అయితే దర్శకుడు కూడా పలుమార్లు ఈ విషయం గురించి ప్రస్తావిస్తూ తనకు కూడా తీయాలని ఉందని అన్నాడు. అయితే ఇప్పటివరకు అది సాధ్యపడలేదు కానీ, త్వరలో సీతా రామ్ జంట తెరపై మళ్ళీ కనిపించబోతున్నారని వార్తలు వస్తున్నాయి.

తెరపై మళ్ళీ మృణాల్ దుల్కర్ జంట?

అయితే సీతారామం(Sita Ramam) తర్వాత మేకర్స్ ఎవరికీ వారు తమ తమ సినిమాలతో బిజీ అయ్యారు. వైజయంతి మూవీస్ కల్కి2898AD వంటి బడా సినిమాలు తెరకెక్కిస్తుండగా, హను రాఘవపూడి వేరే ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఇక దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ తో బిజీ గా ఉండగా, మృణాల్ ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్లో బిజీ అయింది. అయితే తాజా సమాచారం ప్రకారం దుల్కర్ సల్మాన్ మృణాల్ ఠాకూర్ కాంబో మళ్ళీ కలవబోతుందట. ఒక స్ట్రెయిట్ తెలుగు సినిమా కోసం ఒక డెబ్యూ డైరెక్టర్ దుల్కర్ సల్మాన్ మరియు మృణాల్ ఠాకూర్‌లను సంప్రదించాడట. వీళ్ళ కాంబోలో సినిమా తీయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక దుల్కర్, మృణాల్ కూడా కథ వినగానే ఒకే చెప్పారని సమచారం. ఇక ఈ సినిమా కూడా ఒక లవ్ స్టొరీగానే తెరకెక్కనుందని తెలుస్తుంది. అయితే ఆ దర్శకుడు ఎవరన్న విషయంపై ఇంకా తెలియలేదు. కానీ త్వరలోనే అఫిషియల్ గా అనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ వార్త వచ్చినప్పటి నుండి సీతారామం ఫ్యాన్స్ ఆనందంగా అవుతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు