Mrunal Thakur : ఆ స్టార్ డైరెక్టర్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన సీత?

Mrunal Thakur : టాలీవుడ్ లో ప్రస్తుతం భారీ డిమాండ్ ఉన్న హీరోయిన్లలో మృణాల్ ఠాకూర్ ఒకరు. పేరుకి బాలీవుడ్ హీరోయిన్ అయినా క్రేజ్ మాత్రం టాలీవుడ్ లోనే తెచ్చుకుంది. ఏ ముహూర్తాన సీతారామం సినిమా ఒప్పుకుందో గాని తన కెరీర్ లోనే బెస్ట్ రోల్ చేసి, బెస్ట్ పెర్ఫార్మెన్స్ కూడా ఇచ్చింది. ఆపై ఇలాంటి పాత్రలు రావంటూనే మరోసారి అదే రేంజ్ రోల్ ని తెలుగులోనే సంపాదించింది. లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన హాయ్ నాన్న లో యశ్న గా అద్భుతమైన పాత్ర పోషించింది. ఈ రోల్ తో కూడా మృణాల్ చాలా మంచి పేరు తెచ్చుకోగా, ముచ్చటగా మూడోసారి ఫ్యామిలీ స్టార్ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమా తాజాగా థియేటర్లలో రిలీజ్ కి రెడీ అయిపొయింది. ఈ సినిమా విజయంపై మృణాల్ ఠాకూర్ చాలా నమ్మకంగా ఉంది. ఇక ఇప్పుడు టాలీవుడ్ లోనే కాకుండా సౌత్ మొత్తం పలు ఆఫర్లు ఈ అమ్మాయి చుట్టూనే తిరుగుతున్నా, తొందరపడకుండా మెల్లిగా సినిమాలు సెలెక్ట్ చేసుకుంటుంది. ఈ క్రమంలో బాలీవుడ్ నుండి ఒక లెజెండరీ డైరెక్టర్ సినిమాలో ఆఫర్ వచ్చిందని తాజాగా వార్తలు వస్తున్నాయి.

ఆ డైరెక్టర్ సినిమాలో మృణాల్.. మరో బెస్ట్ రోల్ గ్యారెంటీ?

ఇక బాలీవుడ్ లో పలు సినిమాలు చేసిన మృణాల్ టాలీవుడ్ లో వచ్చినంత గుర్తింపు తెచ్చుకోలేదు. అయినా బాలీవుడ్ లోను భారీ అవ‌కాశాల కోసం ట్రై చేస్తుండగా, తాను పాత్ర‌ల విష‌యంలో కూడా చాలా సెల‌క్టివ్ గా ఉంటున్నాన‌ని మృణాల్ తాజా ఇంటర్వ్యూలలో వెల్ల‌డించింది. ఇక ఆ ఇంటర్వ్యూ లు చూస్తుంటే ముందు ముందు మ‌రిన్ని ప్ర‌యోగాత్మ‌క చిత్రాల్లో ఆక‌ట్టుకునే పాత్ర‌ల్లో మృణాల్ న‌టించాల‌ని భావిస్తోంద‌ని అర్థ‌మ‌వుతోంది. ఈ క్రమంలో బాలీవుడ్ లెజెండరీ క‌ళాత్మ‌క చిత్రాల ద‌ర్శ‌కుడు సంజ‌య్ లీలా భ‌న్సాలీ సినిమాలో ఆఫర్ వచ్చిందని వార్తలు వస్తున్నాయి. సంజయ్ లీల భన్సాలీ రాబోయే సినిమాలో మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) హీరోయిన్ గా నటించనుండగా, ఇది పీరియాడిక‌ల్ డ్రామాతో రూపొంద‌నున్న సినిమా అని తెలుస్తోంది. ప్ర‌స్తుతం విజయ్ దేవరకొండతో ఫ్యామిలీ స్టార్ సినిమాని ప్ర‌మోట్ చేస్తున్న మృణాల్ ఈ విష‌యాన్ని ఓ ఇంటర్వ్యూ లో ఖ‌రారు చేసింది.

నిజమైతే బాలీవుడ్ లోనూ పాగా?

అయితే సంజయ్ లీలా భన్సాలీ నుండి ఇంకా అఫిషియల్ గా కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. ఇకపోతే సంజయ్ లీలా భ‌న్సాలీతో సినిమా ఆఫ‌ర్ అంటే ఒక రకంగా అది గేమ్ ఛేంజింగ్ మూవీ అని భావించాలి. భారీ సెట్లు, కాస్ట్యూమ్స్ తో పాటు పాత్ర‌లో డెప్త్, న‌ట‌న ప‌రంగా ఇన్ డెప్త్ పెర్ఫామెన్స్ ఇలాంటివన్నీ న‌టీన‌టుల కెరీర్ ని పూర్తిగా మార్చేసే ఛాలెంజింగ్ డైరెక్ట‌ర్ సంజ‌య్ లీలా భ‌న్సాలీ. ముఖ్యంగా ఈయన ద్వారా చాలా మంది హీరోయిన్లు స్టార్ హీరోయిన్లు అయ్యారు. అత‌డి ద‌ర్శ‌క‌త్వంలో ఒక్క‌సారి న‌టించినా గొప్ప పేరొస్తుంద‌ని న‌టీన‌టులు భావిస్తుంటారు. ముఖ్యంగా ఆలియా, ప్రియాంక చోప్రా, దీపిక ప‌దుకొనే, ఐశ్వ‌ర్యారాయ్ వంటి స్టార్లకు మ‌ర‌పురాని పాత్ర‌ల్లో అవ‌కాశాలు క‌ల్పించిన భ‌న్సాలీ ఇప్పుడు మృణాల్ కు అదే స్థాయి ఆఫ‌ర్ ని అందిస్తున్నాడట. ఇక భ‌న్సాలీ కొత్త సినిమా వేశ్యల కథా నేప‌థ్యంలో రూపొందిస్తున్న‌ హీరామండి చిత్రంలో మ‌నీషాకొయిలారా, అదితీరావ్ హైద‌రీ స‌హా ప‌లువురు హీరోయిన్లు అవ‌కాశం అందుకున్న సంగ‌తి తెలిసిందే. మరి మృణాల్ ఠాకూర్ తో సినిమా ఎప్పుడు మొదలవుతుందో అప్డేట్ రావాల్సి ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు