Family Star Twitter Review : రౌడీ హీరో సక్సెస్స్ అయ్యారా..టాక్ ఎలా వుందంటే..?

Family Star Twitter Review : భారీ అంచనాల మధ్య అంతకు మించి ప్రమోషన్స్ మధ్య విడుదలైన చిత్రం ఫ్యామిలీ స్టార్.. విజయ్ దేవరకొండ హీరోగా మృణాల్ ఠాగూర్ హీరోయిన్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని.. పరుశురాం దర్శకత్వం వహించగా..నేడు విడుదలయ్యి సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది.. ఇప్పటికే యూఎస్ లో ప్రీమియర్లు పడ్డాయి.. దీంతో సినిమా టాక్ కాస్త బయటకి వచ్చింది.. ఇప్పటివరకు చూసుకుంటే కాస్త మిక్స్డ్ టాక్ వచ్చినట్లు తెలుస్తోంది.. ముఖ్యంగా ప్రీమియర్ షో చూసిన ఆడియో సినిమాపై తమ అభిప్రాయాలను ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.. మరి సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

ఫ్యామిలీ స్టార్ ట్విట్టర్ రివ్యూ..

ఫ్యామిలీ స్టార్ సినిమా సీరియల్ లా కనిపిస్తోందంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.. అయితే ఈ సినిమాకి మృణాల్ స్క్రీన్ ప్రజెంట్స్ , విజయ్ దేవరకొండ నటన ప్లస్ పాయింట్ గా నిలిచాయని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.. మరి కొంతమంది సినిమా బాగుంది కానీ మెల్లగా ఎక్కుతుంది అంటున్నారు.. ఇక పూర్తి రివ్యూ విషయానికి వస్తే.. ఈ సినిమా ఏ మాత్రం కొత్తగా కానీ.. ఆసక్తికరంగా కానీ లేదు అని చెబుతున్నారు.. అంతేకాదు కొంతవరకు టైం పాస్ అవుతుంది కానీ ఆ తర్వాత ఎందుకు థియేటర్ కి వచ్చామా అన్న ఫీలింగ్ కలుగుతుందని ఆడియన్స్ ట్విట్టర్ ద్వారా తెలియజేస్తున్నారు.. ఇందులో రియల్ ఎమోషన్స్ ఏవి లేవు అని, అసలు ఈ సినిమాకి ప్రేక్షకులు కనెక్ట్ అవ్వడం అసలు సాధ్యపడదు అని కూడా చెబుతున్నారు..ప్రీ ఇంటర్వెల్ వరకు సీరియల్ లా సాగుతుందని.. సెకండ్ హాఫ్ కాస్త ఫన్నీగా సాగుతుందని కానీ వెంటనే నిరాసక్తంగా , సూక్తులు చెబుతున్నట్టుగా కనిపిస్తుందట ..మ్యూజిక్ కూడా అంత బాగా లేదట.. గీతాగోవిందం కాంబో ఈసారి వేస్ట్ అయిందని.. బిలో యావరేజ్ గా సినిమా నిలుస్తుందని చెబుతున్నారు..

సర్కారు వారి పాట సినిమాలో కీర్తి సురేష్ ఫస్ట్ హాఫ్ లో పూర్ గర్ల్ గా నటించింది.. ఇటు ఫ్యామిలీ స్టార్ లో కూడా మృనాల్ ఠాగూర్ మొదటి భాగంలో పూర్ గర్ల్ గాని నటించింది.. దీన్ని బట్టి ఇది పేట్ల యూనివర్సిటీ అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఏమాత్రం ఇంప్రెస్సివ్ గా లేదని, ప్లాట్, పాయింట్ ఏది కూడా కొత్తగా లేదని, కనీసం నటీనటుల పర్ఫామెన్స్ కూడా అంత గొప్పగా లేదని ట్విట్టర్ ద్వారా తెలియజేస్తున్నారు.

- Advertisement -

మరొక ఆడియన్.. ఏమాత్రం అంచనాలు పెట్టుకోకుండా వెళ్ళాము.. కానీ చాలా నిరుత్సాహపడ్డాము అని చెబుతున్నారు.. మొత్తానికి అయితే పరశురాం బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్లు ఇచ్చాడంటూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం..

ఇంకొకరు అయితే రీసెంట్ టైంలో నేను చూసిన వరస్ట్ మూవీ ఇది.. సెకండ్ హాఫ్ మరింత వరస్ట్ గా ఉంది.. విజయ్ జస్ట్ ఒక బొమ్మలా ఉన్నాడేమో.. అతనిలో స్టఫ్ లేదేమో అన్నట్టు కనిపించింది. విశ్వక్సేన్ లాంటోడు.. గామి లాంటి కొత్తవి ట్రై చేస్తూ ఉంటే.. విజయ్ మాత్రం స్టార్ మా సీరియల్స్ చేస్తున్నాడు అంటూ కౌంటర్లు వేస్తున్నారు.

ఇక తెలుగు ఆడియన్స్ మాత్రమే కాదు తమిళ్ ఆడియన్స్ కూడా ట్విట్టర్ రివ్యూ ( Family Star Twitter Review ) ద్వారా సినిమాపై తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు..80 ల నాటి కథ ఇది.. ఇందులో సిల్లీ సీన్స్ తప్ప ఏమీ లేవు.. ముఖ్యంగా విజయ్ దేవరకొండ , మృనాల్ ఠాకూర్ మధ్య అసలు కెమిస్ట్రీ నే కనిపించలేదు. ఇక ఇందులో రెండు పాటలు, ఇంటర్వెల్ బ్లాకు , రెండు సరదా సన్నివేశాలు మినహా మూడు గంటల పాటు సాగే సినిమా చాలా బోరింగ్ గా అనిపిస్తోంది. ఇందులో ఎమోషన్స్ లేవు.. అసలు ప్రేక్షకులకు ఏమాత్రం కనెక్ట్ కావడం లేదు.. ఇదొక చెత్త సినిమా అంటూ ట్విట్టర్ రివ్యూ ఇస్తున్నారు..

మొత్తానికైతే ఈ సినిమా నిర్మాత దిల్ రాజు భారీ రేంజిలో ప్రమోషన్స్ చేపట్టారు.. అందుకు తగ్గట్టుగానే విజయ్ దేవరకొండ కూడా సక్సెస్ కొడతాను అనే ధీమా వ్యక్తం చేశారు. అయితే ఇద్దరూ కూడా బోల్తాపడ్డారు. మొత్తానికి ఈ సినిమా బిలో యావరేజ్ గా నిలవబోతోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు