The Girlfriend : టీజర్ అనౌన్స్ చేసి పోస్టర్ మొహాన కొడుతున్నారు

The Girlfriend : తెలుగు ప్రేక్షకుల గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక మంచి సినిమా వస్తే దానిని ఆదరించటానికి ఎప్పుడూ రెడీగా ఉంటారు. కమర్షియల్ స్టార్ హీరో అయ్యుండాలి, ప్రాపర్ ఫైట్లు ఉండాలి,సాంగ్స్ ఉండాలి అని కాకుండా లేడి ఓరియెంటెడ్ సినిమాలను కూడా ఆదరించిన రోజులు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నాయి. అనుష్క నటించిన అరుంధతి సినిమా అంత పెద్ద హిట్ అవ్వడానికి కారణం కూడా తెలుగు ఆడియన్స్ అని చెప్పొచ్చు. ఆ తర్వాత ఎన్నో లేడి ఓరియంటెడ్ సినిమాలు చేసింది అనుష్క. కానీ ఆ తర్వాత చేసిన సినిమాలు ఊహించిన ఫలితాన్ని ఇవ్వలేదు.

ఇక తమిళ్ స్టార్ హీరోయిన్ నయనతార గురించి మనకు తెలిసిందే. లేడీ సూపర్ స్టార్ గా పేరు సాధించి ఎన్నో లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్స్ చేసింది. ఆ తర్వాత త్రిష కూడా చాలా సినిమాలను చేసింది. అయితే త్రిష కి ఊహించిన స్థాయిలో లేరి ఓరియంటెడ్ సినిమాలు పడలేదు. కానీ నయనతార కి మాత్రం మయూరి, కర్తవ్యం వంటి సినిమాలు మంచి హిట్ అయ్యాయి. మహానటి సినిమా తర్వాత కీర్తి సురేష్ కూడా లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్ చేసింది. కానీ అవి కూడా ఊహించిన స్థాయిలో ఆడలేదు.

ఇకపోతే ఛలో సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది రష్మిక మందన్న. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘనవిజయాన్ని సాధించి వరుస అవకాశాలను అందుకుంది. విజయ్ దేవరకొండ తో గీత గోవిందం సినిమా చేసి 100 కోట్లు మార్కెట్ చూసింది. ఆ తర్వాత మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు వంటి స్టార్ హీరోల సినిమాల్లో కూడా నటించి, తనని తాను ప్రూవ్ చేసుకొని వరుస అవకాశాలను దక్కించుకుంది.

- Advertisement -

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ చేసిన పుష్ప సినిమాలో శ్రీవల్లి పాత్ర రష్మికను పాన్ ఇండియా హీరోయిన్ ను చేసేసింది. పుష్ప సినిమా చూపించిన ఇంపాక్ట్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది పొలిటిషియన్స్, స్పోర్ట్స్ మెన్స్ అందరూ కూడా ఈ సినిమా డైలాగులను ఎక్కడ పెడితే అక్కడ విరివిగా వాడేసారు. ఇకపోతే రీసెంట్ టైమ్స్ లో సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించిన అనిమల్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమాతో బాలీవుడ్ లో కూడా తన టాలెంట్ చూపించింది రష్మిక. అయితే రష్మిక ఎన్ని సినిమాలు చేసినా కూడా అనిమల్ సినిమాలో రష్మిక పర్ఫామెన్స్ చూసి చాలామంది అద్భుతంగా చేసింది అని ప్రశంసలు కురిపించారు. ఇకపోతే ప్రస్తుతం రష్మిక కూడా ఒక లేడీ ఓరియంటెడ్ సినిమాను చేస్తుంది ఆ సినిమానే ది గర్ల్ ఫ్రెండ్.

అందాల రాక్షసి సినిమాతో నటుడుగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు రాహుల్ రవీంద్రన్. ఆ తర్వాత చాలా సినిమాలు హీరోగానే చేసాడు. అయితే సుశాంత్ హీరోగా చిల సౌ అనే ఒక సినిమాను చేశాడు రాహుల్. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘనవిజయాన్ని సాధించి రాహుల్ రవీంద్రన్ లో ఇంత మంచి దర్శకుడు ఉన్నాడా అని ప్రూవ్ చేసింది. ఆ సినిమా తర్వాత కింగ్ నాగార్జునతో మన్మధుడు 2 సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా ఊహించిన స్థాయిలో ఆడలేదు దీని కారణం మన్మధుడు సినిమా హిట్ అవటం. మన్మధుడు రేంజ్ లో ఉంటుందని చాలా మంది ఊహించారు. కానీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మారింది.

మళ్లీ చాలా రోజుల తర్వాత రాహుల్ రవీంద్రన్ మెగా ఫోన్ పట్టుకున్నాడు. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రష్మిక చేస్తున్న సినిమా ది గర్ల్ ఫ్రెండ్(The Girlfriend). రష్మిక పుట్టినరోజు సందర్భంగా ది గర్ల్ ఫ్రెండ్ సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేస్తారు అంటూ అనౌన్స్ చేశారు. కానీ కేవలం పోస్టర్ మాత్రమే రిలీజ్ చేస్తున్నట్లు ఇప్పుడు చెప్పుకొచ్చారు. అయితే ఈ టీజర్ ను ఇదే నెలలో మరోసారి రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. అలానే రష్మిక కొంతమంది ఫ్యాన్స్ ని కలవనున్నట్లు చెప్పుకొచ్చారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు