Rajinikanth : తలైవా లోకి కాంబో టైటిల్ ఫిక్స్..?

Rajinikanth : కోలీవుడ్ సూపర్ స్టార్ వరుస సినిమాలతో యంగ్ హీరోలకు పోటీనిస్తూ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం సౌత్ సీనియర్ స్టార్ హీరోల్లో ఒక రకంగా అందరికంటే ఎక్కువ బిజీగా రజినీయే ఉన్నాడని చెప్పొచ్చు. ఇక లాస్ట్ ఇయర్ జైలర్ తో వచ్చి ఎంత బీభత్సం సృష్టించాడో తెలిసిందే. ఆ సినిమా తమిళనాట ఇండస్ట్రీ హిట్ గా నిలవడమే గాకుండా రజినీకాంత్ మాస్ స్టార్ డమ్ ఏంటో ఇప్పటి హీరోలకు మరోసారి తెలియచేసింది. అయితే అనూహ్యంగా ఈ ఇయర్ వచ్చిన లాల్ సలాం సినిమాతో ఆల్ టైం డిజాస్టర్ ని కూడా అనుకున్నారు. తన కూతురు ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా రిలీజ్ కి ముందు నుండి అంతగా రెస్పాన్స్ తెచ్చుకోకపోగా, కేవలం రజిని పేరు మీదే రిలీజ్ అయింది. చాలా మంది అనుకున్నట్టుగానే సినిమా డిజాస్టర్ కాగా, దర్శకురాలిగా రజిని కూతురికి మరింత బ్యాడ్ నేమ్ తెచ్చిపెట్టింది. ఇక ఆ అమ్మాయి డైరెక్షన్ వదిలేస్తే మంచిదని ఫ్యాన్స్ కూడా మొరపెట్టుకున్నారు. ఇదిలా ఉండగా రజిని మాత్రం ఇదేదీ పట్టించుకోకుండా తన తదుపరి సినిమాలపై దృష్టి పెట్టారు. ప్రస్తుతం టిజి జ్ఞానవేల్ దర్శకత్వంలో ‘వెట్టైయన్’ అనే సినిమా చేస్తున్నారు రజినీకాంత్. అలాగే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తో కూడా ఓ సినిమా చేస్తున్నారన్న సంగతి తెల్సిందే.

రజిని లోకి మూవీ టైటిల్ ఫిక్స్?

ఇదిలా ఉండగా రజినీకాంత్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఒకవైపు వేట్టయన్ షూటింగ్ లో పాల్గొంటూనే ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తి చేస్తున్నాడు. ఇదిలా ఉండగా తాజాగా రజిని లోకి మూవీ టైటిల్ గురించి లేటెస్ట్ గా అప్డేట్ వచ్చింది. ఈ సినిమాకు ‘కళుగు’ అనే టైటిల్ ఫిక్స్ అయ్యారని సమాచారం. అయితే కళుగు అంటే తమిళంలో డేగ అని అర్ధం వస్తుందట. ఇక ఈ టైటిల్ ని ఈ నెల 22న అఫిషియల్ గా ప్రకటించబోతున్నారని సమాచారం. ఇక ఈ న్యూస్ తెలిసినప్పటినుండి రజిని ఫ్యాన్స్ సోషల్ మీడియా లో టైటిల్ ని తెగ వైరల్ చేసేస్తున్నారు. ఫ్యాన్ మేడ్ పోస్టర్లతో మూవీ నుండే వచ్చినట్టు డిజైన్ చేసి టైటిల్ రచ్చ చేస్తున్నారు.

స్మగ్లర్ గా రజిని?

ఇక రజినీకాంత్ లోకేష్ కనగరాజ్ కాంబోలో వస్తున్న ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతుండగా ఈ సినిమాలో రజినీకాంత్ ఒక గోల్డ్ స్మగ్లర్ గా కనిపించనున్నారట. అయితే రజిని దీనికంటే ముందు రాబోయే జ్ఞానవేల్ సినిమాలో మాత్రం పోలీస్ ఆఫీసర్ గా నటిస్తుండడం విశేషం. ఇక రజినీకాంత్ ఇలాంటి దొంగల పాత్రలు స్మగ్లర్ల పాత్రలు వేయడం కాస్త తక్కువే అని చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి పాత్రలు తమిళ్ లో ఎక్కువగా కమల్ హాసన్ చేస్తాడు. కానీ ఇప్పుడు రజిని చాలా రోజుల తర్వాత ఇలాంటి పాత్ర చేస్తుండడం వల్ల సినిమాపై చాలా ఇంట్రెస్టింగ్ బజ్ నెలకొని ఉంది. ఇక రజిని లోకి సినిమాకు మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు