Thalaivar170: “వేటగాడు”గా సూపర్ స్టార్..!

సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ బ్లాక్ బస్టర్ తరువాత జై భీమ్ దర్శకుడు టి.జె. జ్ఞానవేల్ తో సినిమా చేస్తున్నాడన్న సంగతి తెలిసిందే. రజినీ కాంత్ తన 170 వ సినిమా గా తెరకెక్కుతున్న ఈ సినిమాను లైకా ప్రొడక్షన్ సంస్థ నిర్మింస్తుంది. ఇటీవల స్టార్ట్ అయిన ఈ సినిమా షూటింగ్ నిర్విరామంగా జరుగుతుంది. ఇక బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కూడా ఈ సినిమాలో ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాడన్న విషయం తెలిసిందే. గత నెలలోనే ముంబై లో వీళ్లిద్దరి మధ్య కొన్ని సీన్లు కూడా తీయడం జరిగింది.

ఇదిలా ఉండగా సూపర్ స్టార్ రజినీకాంత్ బర్త్ డే స్పెషల్ గా ఈ సినిమా నుండి రజిని ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడమే గాకుండా సినిమా టైటిల్ ని కూడా అనౌన్స్ చేయడం జరిగింది. రజినీకాంత్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ సినిమాకు “వేట్టైయన్” అని టైటిల్ ని ఫిక్స్ చేసారు. అంటే తెలుగులో “వేటగాడు” అని అర్ధం. అయితే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ తమిళ్ లో మాత్రమే ఉండగా, తెలుగు టైటిల్ ఇంకా రిలీజ్ చేయలేదు. బహుశా తెలుగులో టైటిల్ పెడితే వేటగాడు అనే పెడతారా? లేక తమిళ్ వెర్షన్ టైటిల్ నే కొనసాగిస్తారా అనేది మేకర్స్ క్లారిటీ ఇవ్వాలి.

- Advertisement -

ఇక రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ లో రజినీకాంత్ ఎప్పట్లాగే తన స్టైలిష్ లుక్స్ స్వాగ్ తో ఆకట్టుకోగా, రజిని ఎంట్రీ కి అనిరుద్ ఇచ్చిన బీజీఎమ్ కూడా అదిరిపోయిందని చెప్పాలి. ఇక ఈ వేట్టైయన్ మూవీ లో ఫహద్ ఫాజిల్, రానా దగ్గుపాటి, మంజు వారియర్, కిషోర్, రితికా సింగ్, రోహిణి, రావు రమేష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 2024 సమ్మర్ లో సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు