Thalaivar170: 33 ఏళ్ళ తర్వాత సెట్స్ లో కలిసిన లెజెండ్స్!

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్, బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఇద్దరూ తమ తమ సినిమాలతో ఆడియన్స్ ని నాలుగు దశాబ్దాలుగా ఎంటర్టైన్ చేస్తున్నారు. హిందీలో అమితాబ్, తమిళ్ లో రజిని నెంబర్ వన్ హీరోలుగా తమ ఆధిపత్యాన్ని కొనసాగించారు. ఇక ఈ ఇద్దరు లెజెండ్స్ ఒకప్పుడు కలిసి కూడా పలు చిత్రాల్లో నటించడం జరిగింది.

రజినీకాంత్ కెరీర్ బిగినింగ్ లో పలు బాలీవుడ్ చిత్రాల్లో అమితాబ్ తో కలిసి నటించారు. వీళ్లిద్దరి కాంబో లో అందా కానూన్, గెరాఫ్తార్ వంటి హిట్ చిత్రాలు వచ్చాయి. చివరగా అమితాబ్, రజిని 1991 లో వచ్చిన హమ్ సినిమాలో కలిసి నటించడం జరిగింది. అయితే ఇప్పుడు తిరిగి 32 ఏళ్ళ తర్వాత ఈ లెజెండ్స్ కలిసి నటిస్తున్నారు.

జై భీం డైరెక్టర్ టీజె జ్ఞానవేల్ రాజా దర్శకత్వంలో రజిని తలైవర్170 తెరకెక్కుతుందన్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ కూడా నటిస్తున్నారని మేకర్స్ అనౌన్స్ చేసారు. ఇక లేటెస్ట్ గా సినిమా షెడ్యూల్ ముంబై లో స్టార్ట్ అవగా, ఆ షెడ్యూల్ లో అమితాబ్ బచ్చన్, రజినీకాంత్ కలిసి షూటింగ్ లో పాల్గొనడం జరిగింది. ఈ సందర్బంగా చిత్ర యూనిట్ వారి స్టిల్ ని షేర్ చేస్తూ సోషల్ మీడియా లో ఫ్యాన్స్ తో పంచుకోవడం జరిగింది.

- Advertisement -

ఇక తలైవర్170 లో మరో తెలుగు హీరో రానా నెగిటివ్ షేడ్స్ లో ఉన్న రోల్ లో నటిస్తున్నాడని తెలిసిందే. 2024 లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు