Nani: వర్కింగ్ డే టెస్ట్ పాసైపోయిన హాయ్ నాన్న!

టాలీవుడ్ లో లాస్ట్ వీక్ రెండు సినిమాలు రిలీజ్ కాగా అందులో న్యాచురల్ స్టార్ నాని నటించిన “హాయ్ నాన్న” సినిమా కూడా ఒకటి. ఒక ఫీల్ గుడ్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటెర్టైన్ మెంట్ గా తెరకెక్కిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా మంచి మౌత్ టాక్ తో దూసుకుపోతుంది. మొదటి రోజు ఎలక్షన్ల ప్రభావం వల్ల సినిమా పాజిటివ్ మౌత్ టాక్ వల్ల వీకెండ్ లో పుంజుకుంది. పైగా పోటీగా వచ్చిన ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ డిజాస్టర్ కావడం దీనికి బాగా కలిసొచ్చింది.

ఇక హాయ్ నాన్న నాలుగు రోజుల వీకెండ్ అడ్వాంటేజ్ తో మంచి ఓపెనింగ్స్ తెచ్చుకోగా ఆ వీకెండ్ లోనే సినిమా బిజినెస్ 60 శాతం వచ్చేసింది. ఇక వర్కింగ్ డే లో ఈ సినిమా ఎంత వరకు హోల్డ్ చూపిస్తుంది, ఆ టెస్ట్ పాస్ అయిందా లేదా అని చాలా మంది నెటిజన్లు అనుమానం వ్యక్తం చేయగా, తెలుగు రాష్ట్రాల్లో డ్రాప్స్ ఎక్కువగా వచ్చినా, ఓవర్సీస్ లో అదిరిపోయే వసూళ్లతో వర్కింగ్ డే టెస్ట్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ తో పాస్ అయింది హాయ్ నాన్న.

ఐదవ రోజు తో వర్కింగ్ డే లోకి ఎంటర్ అయిన హాయ్ నాన్న తెలుగు రాష్ట్రాల్లో 1.37 కోట్ల షేర్, వరల్డ్ వైడ్ గా 2.39 కోట్ల షేర్ ని రాబట్టింది. ఇక ఐదు రోజుల్లో హాయ్ నాన్న 23.50 కోట్ల షేర్ ని సాధించగా, బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే మరో 5 కోట్ల వరకు వసూలు చేయాలి. ఇక వచ్చే వారం కూడా పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలు ఏమి రిలీజ్ కావడం లేదు కాబట్టి ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయిపోవడం ఖాయమని చెప్పాలి. అయితే రెండు వారాల తర్వాత సలార్ రిలీజ్ ఉంటుంది కాబట్టి హాయ్ నాన్న కి లాంగ్ రన్ స్కోప్ మాత్రం ఉండదు.

- Advertisement -

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు