Anil Ravipudi: నా భార్య టార్చర్ ని తట్టుకోలేకపోతున్నా – అనిల్ రావిపూడి..!

ప్రముఖ యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎఫ్2 , ఎఫ్3 సినిమాల తర్వాత తాజాగా బాలయ్యతో భగవంత్ కేసరి సినిమా చేసి భారీ విజయాన్ని అందుకున్న అనిల్ రావిపూడి.. ఇప్పుడు మరో స్టార్ హీరోతో త్వరలోనే మన ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా ఒక సినిమా ఈవెంట్ కి ముఖ్యఅతిథిగా వచ్చిన ఆయన.. తన భార్య తనను టార్చర్ పెడుతోంది అంటూ చేసిన కామెంట్లు ఇప్పుడు మరింత వైరల్ గా మారుతున్నాయి.

అసలు విషయంలోకి వెళ్తే.. బిగ్ బాస్ సోహెల్ హీరోగా.. సహానిర్మాతగా రూపొందుతున్న చిత్రం బూట్ కట్ బాలరాజు. ఈ సినిమాలో సద్దాం, ఇంద్రజ, మేఘ లేఖ , అవినాష్ , సిరి తదితరులు కీలకపాత్ర పోషిస్తున్నారు. శ్రీ కోనేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని మహమ్మద్ పాషా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా టీజర్ ని హైదరాబాద్ లోనే ప్రసాద్ ల్యాబ్ లో విడుదల చేయగా ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేశారు అనిల్ రావిపూడి.. ఈ క్రమంలోనే తాజాగా ఆయన మాట్లాడుతూ.. షూటింగ్ ఉన్నప్పుడు తొందరగా బయలుదేరి వచ్చేవాడిని.. బాలయ్య బాబు సినిమాతో సక్సెస్ వచ్చింది.. మా ఆవిడకి చెప్పాను కొద్దిగా రిలాక్స్ అవుతానే అని.. కానీ పొద్దున్నే పిల్లల్ని స్కూల్లో దింపమని చెప్పింది.. విశ్రాంతి తీసుకుంటానంటే పనులు చెబుతూ టార్చర్ చేస్తోంది అంటూ సరదాగా తెలిపారు అనిల్ రావిపూడి. ఇక ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి.

ఇకపోతే అనిల్ రావిపూడి ఇలా అనడానికి కారణం బూట్ కట్ బాలరాజు టీజర్ లాంచ్ ఈవెంట్ కి కాస్త ఆలస్యంగా రావడం.. అయితే తాను ఎందుకు ఆలస్యంగా వచ్చాను చెప్పడానికి సరదాగా ఇలా ఇంట్లో జరిగిన విషయాన్ని ఆయన వివరించారు. అంతేకాదు ఈ విషయాన్ని చెబుతూ.. రేపటి నుంచి వర్క్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అంటూ తెలిపారు అనిల్ రావిపూడి.. బూట్ కట్ బాలరాజు సినిమా గురించి మాట్లాడుతూ.. అందరికీ నా విషెస్.. ఇప్పుడే అవినాష్ చెప్పాడు.. పిలవగానే వచ్చారని.. దీని వెనుక స్కెచ్ ఉంది.. సోహెల్ నాకు బాగా తెలుసు.. బిగ్ బాస్ నుంచి కూడా చాలా కష్టపడుతున్నాడు.. సపోర్టు చేయడానికి నేనెప్పుడైనా రావడానికి సిద్ధం.. ఫంక్షన్ ఉంది.. రావాలన్నా అని నాకు చెప్పాడు. నాకు పనులు ఉన్నాయి సోహెల్.. నేను చెప్తాను అని అన్నాను.. సరే అడుగుతున్నాడు.. చెప్తాను చెప్తాను అని అంటున్న క్రమంలోనే నేను వస్తున్నట్టు పోస్టర్ వేసి మార్కెట్లో పెట్టేసాడు..

- Advertisement -

ఇక నేను వస్తున్నాను అని ఇంకా కన్ఫామ్ చేయలేదు కదా అని.. అనుకునే లోపే అవినాష్ వాట్సాప్ లో థాంక్స్ అన్న వస్తున్నందుకు అని మెసేజ్ పెట్టాడు.. మొత్తానికి అయితే నా పైన నమ్మకంతో వాళ్లు ఇలా చేశారు.. ఇక నేను అందుకే వచ్చాను.. కచ్చితంగా ఈ సినిమా సక్సెస్ అందుకుంటుంది.. సోహెల్ కష్టానికి ఫలితం ఉంటుంది అంటూ తెలిపారు అనిల్ రావిపూడి.

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు