Salaar: జాతకం చూస్తే.. సినిమా సక్సెస్ అవుతుందా..?

బాహుబలి సినిమా తర్వాత సరైన విజయం లేక సక్సెస్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా నటిస్తున్న చిత్రం సలార్.. కేజీఎఫ్ సినిమాల డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇకపోతే సలార్ సినిమా రెండు భాగాలుగా రానున్న నేపథ్యంలో మొదటి భాగం ‘సీజ్ ఫైర్ ‘ఈనెల 22వ తేదీన రిలీజ్ కాబోతోంది. ఇక సెప్టెంబర్ నెలలోనే రిలీజ్ కావాల్సి ఉండగా.. పోస్ట్ పోన్ చేసి డిసెంబర్ కి తీసుకొచ్చారు. ఇక ఈ కొత్త విడుదల తేదీలో సలార్ సినిమాతో పాటు షారుక్ ఖాన్ మూవీ డంకీ, హాలీవుడ్ సినిమా అక్వామన్ కూడా విడుదల కాబోతున్న నేపథ్యంలో సలార్ చిత్ర బృందం.. ఎందుకు సినిమాను పోస్ట్ పోన్ చేశారు అనేది ప్రశ్నగానే మిగిలింది.

తాజాగా ఈ ప్రశ్నకి సలార్ నిర్మాత విజయ్ కిరంగదూర్ బదులిచ్చారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నిర్మాత విజయ్ కిరంగదూర్ మాట్లాడుతూ.. మేము జాతకాలను బాగా నమ్ముతాము.. గత పది సంవత్సరాలుగా మేము అనుసరిస్తున్న పద్ధతిలోనే జాతకం చూసి మరీ రిలీజ్ తేదీని ఎంపిక చేసుకున్నాము అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఈ విషయం కాస్త ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారుతోంది. దీనిని చూసిన చాలా మందిని నెటిజన్స్.. అంటే జాతకం చూసి సినిమా రిలీజ్ చేస్తే ఈ సినిమా హిట్ అవుతుందా? అంటూ కొంతమంది కామెంట్ లు చేస్తున్నారు. మరికొంతమంది కథ , కథనం లేకపోతే జాతకాలు కాదు కదా.. ఏం చూసినా సరే ఆ కథ ప్రేక్షకులను మెప్పించలేదు.. సక్సెస్ కాదు అంటూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. మరి ఈ విషయంపై విజయ్ కిరంగదూర్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

ఇకపోతే ఈ సినిమా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన మొదటి చిత్రం ఉగ్రం.. రీమేక్ అంటూ వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ వార్తలపై కూడా నిర్మాత స్పందించారు. ఉగ్రమ్, కే జి ఎఫ్, సలార్ ఇలా ప్రతి దానిని కూడా డైరెక్టర్ భిన్నంగానే తెరకెక్కిస్తున్నారు అంటూ తెలిపారు. ఇకపోతే ఈ సినిమాలోని “సూరీడే” అనే పాటను రిలీజ్ చేయబోతున్నారు. ఇక శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ , జగపతిబాబు విలన్ పాత్రలు పోషిస్తున్నారు.

- Advertisement -

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు