Sriram: ఆ భయం ఎప్పటికీ పోదు – శ్రీరామ్

శ్రీకాంత్ అలియాస్ శ్రీరామ్ హీరోగా ఖుషీ రవి జంటగా నటించిన తాజా చిత్రం పిండం. కళాహి మీడియా బ్యానర్ పై యశ్వంత్ దగ్గుమాటి నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 15వ తేదీన ప్రపంచవ్యాప్తంగా చాలా గ్రాండ్గా విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా హీరో శ్రీరామ్ ప్రమోషన్స్ లో భాగంగా మీడియాకు సినిమా గురించిన పలు విశేషాలను తెలియజేస్తున్నారు. ఈ చిత్రం ద్వారా సాయికిరణ్ దైదా దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా శ్రీరామ్ ఎన్నో విషయాలను వెల్లడించారు..

ఒకరికొకరు సినిమా వచ్చి 20 సంవత్సరాలు అవుతున్నా.. ఇప్పటికీ అలాగే ఉన్నారు.. మీ ఆరోగ్య రహస్యం ఏమిటి..? అని యాంకర్ అడగ్గా.. దానికి శ్రీరామ్ మాట్లాడుతూ.. ఆహారం విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటాను. ఎక్కువగా బయట ఆహారాన్ని ఇష్టపడను. సాధ్యమైనంత వరకు ఇంటి నుంచే భోజనం తెప్పించుకుంటాను..ఇక బయటికి వెళ్లినా తప్పని పరిస్థితిలో తినాల్సిన వస్తే.. పప్పు, సాంబార్ వంటి శాకాహారం మాత్రమే తీసుకుంటాను. అంతే కాదు ఉన్న దాంట్లోనే సంతృప్తి చెంది ఆనందంగా ఉంటాను అంటూ తెలిపారు.

శ్రీరామ్ ఇక పిండం సినిమా గురించి ఏదైనా చెప్పండి అని అడగ్గా.. హారర్ సినిమాల విషయంలో నాకు ఎప్పటికీ ఆ భయం పోదు.. అదేమిటంటే పేరుకే హారర్ సినిమా అంటారు.. కానీ అందులో అనవసరమైన రొమాన్స్, సాంగ్స్ , కామెడీ వంటివి ఇరికిస్తూ ఉంటారు.. హారర్ జానర్ అంటే ఆ సినిమాలో హరర్ మాత్రమే ఉండాలి. థియేటర్లో మనం చూసినప్పుడు ఉలిక్కిపడేలా ఉండాలి..అయితే డైరెక్టర్ పిండం కథ చెప్పగానే నచ్చింది కొత్త దర్శకుడు అయినప్పటికీ కూడా ఆయనకు కథ పైన ఒక క్లారిటీ ఉంది. ఇక ఈ డైరెక్టర్ తీసిన స్మోక్ అనే షార్ట్ ఫిలిం చూసిన తరువాతనే ఆయనపై నాకు నమ్మకం కలిగింది.. ఇన్ని రోజుల్లో.. ఇంత బడ్జెట్లో సినిమా పూర్తి చేస్తామని తెలిపారు. చెప్పినట్లుగానే చేశారు అంటూ తెలిపారు.

- Advertisement -

ఇక ఈ సినిమా ఖచ్చితంగా థియేటర్లలో చూసి అనుభూతి చెందాల్సిన అసలైన హారర్ సినిమా.. ఒక ఇల్లు , ఒక కుటుంబం అన్నట్టుగా సినిమా ఉండదు.. ఇందులో చాలా కథే ఉంటుంది. కచ్చితంగా పిండం అనే టైటిల్ తో కూడా కథ ముడిపడి ఉంది అంటూ శ్రీ రామ్ వెల్లడించారు.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు