Salaar: డార్లింగ్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్… నో ప్రీ రిలీజ్ ఈవెంట్

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సలార్ మూవీ విషయంలో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ విషయంలో మేకర్ షాకింగ్ డెసిషన్ తీసుకున్నారా? డార్లింగ్ ఫాన్స్ కి నిరాశ తప్పదా?

హైలీ ఎంటిసిపేటెడ్ మూవీ “సలార్”. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి కేజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీకి సంబంధించిన ట్రైలర్ ని కొద్ది రోజుల క్రితం విడుదల చేశారు మేకర్స్. ఆ ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ట్రైలర్లో ఖాన్సార్ రాజ్యాన్ని పరిచయం చేయడంతో పాటు సినిమా కథ ఏంటి అని ప్రధాన అంశాన్ని అందరికీ అర్థమయ్యేలా చేసింది. ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ ల మధ్య ఉన్న స్నేహబంధం ఈ మూవీ కథ. ఈ మూవీ డిసెంబర్ 22న పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో సలార్ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఉండబోదంటూ జరుగుతున్న ప్రచారం ప్రభాస్ ఫ్యాన్స్ ని కలవరపెడుతోంది.

నిజానికి ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న ఆడియన్స్ అంతా సలార్ రెండవ ట్రైలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్ వంటి ఇతర ప్రమోషనల్ కంటెంట్ పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇలాంటి తరుణంలో సలార్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఉండదనే విచారకరమైన వార్తను విని ప్రభాస్ ఫ్యాన్స్ నిరాశకు గురవుతున్నారు. అయితే ఇంత పెద్ద సినిమాను ప్రమోట్ చేయడానికి ఎందుకు ఆసక్తి చూపడం లేదో ఎవరికి అర్థం కావడం లేదు. సినిమా రిలీజ్ కు ఇంకా పది రోజులు సినిమా రిలీజ్ కు ఇంకా పట్టుమని పది రోజులు కూడా లేదు. ఇప్పటివరకు చిత్ర బృందం కనీసం ఇంటర్వ్యూలు కూడా ప్లాన్ చేయలేదు. ఒక ప్రమోషన్ ఈవెంట్ కూడా జరగలేదు.

- Advertisement -

ఇక సాధారణంగానే ఈరోజుల్లో ఏ సినిమాకైనా రిలీజ్ కు ముందు పాటలు రిలీజ్ చేయడం అంచనాలు పెంచేయడం జరుగుతూ ఉంటుంది. కానీ సలార్ మూవీ నుంచి ఇంకా ఒక్క పాట కూడా రిలీజ్ కాలేదు. ఇది చాలదన్నట్టు ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా లేదంటున్నారు. ఇక పాన్ ఇండియా సినిమా అంటే అన్ని భాషల్లోనూ సినిమాను ప్రమోట్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ చాలా టీం మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. ఇదంతా చూస్తుంటే ప్రస్తుతం సినిమాపై ఉన్న హైప్ చాలని చిత్ర బృందం భావిస్తున్నట్టుగా అనిపిస్తోంది. కానీ కలర్ టీం తీరుపై అభిమానులు మాత్రం అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. సలార్ మూవీకి సంబంధించిన ప్రమోషనల్ ఈవెంట్ జోరుగా జరగాలని కోరుకుంటున్నారు.

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు