Salar trailer : సలార్ సహా అత్యధిక లైక్స్ వచ్చిన 5 టాలీవుడ్ ట్రైలర్స్ ఇవే..!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ హీరోగా న‌టించిన స‌లార్ సినిమా ట్రైల‌ర్ ను చిత్ర యూనిట్ డిసెంబ‌ర్ 1న విడుద‌ల చేసింది. కాగా ఈ ట్రైల‌ర్ యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. అంతే కాకుండా టాలీవుడ్లో అత్య‌ధిక వ్యూవ్స్ వ‌చ్చిన ట్రైలర్ గా రికార్డులు క్రియేట్ చేస్తోంది. మ‌రోవైపు విడుద‌ల చేసిన త‌క్కువ స‌మయంలోనే ఎక్కువ లైక్స్ వ‌చ్చిన ట్రైల‌ర్ కూడా ఇదే కావ‌డం విశేషం. స‌లార్ ట్రైల‌ర్ విడుద‌ల చేసిన 1గంట 11 ని.ల‌కే 700k లైక్స్ వచ్చాయి.

అంటే కేవలం అభిమానులకే కాకుండా ఈ ట్రైలర్ ను ఎంతమంది ఇష్టపడ్డారో అర్థం చేసుకోవచ్చు. ఇక సలార్ మాధిరిగా టాలీవుడ్ లో ఇదివరకు నాలుగు సినిమాలు ట్రైలర్ విడుదలైన తక్కువ సమయంలో ఎక్కువ లైక్స్ ను సంపాదించాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం…పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా ట్రైలర్ 1గంట 14 నిమిషాలలో 700k లైక్స్ ను సంపాదించింది. ఇది వరకు భీమ్లానాయక్ సినిమా అత్యధిక లైక్స్ తో మొదటి స్థానంలో ఉండగా దాన్నీ సలార్ బ్రేక్ చేయడంతో భీమ్లానాయక్ రెండో స్థానానికి వెళ్లిపోయాడు.

ఇక భీమ్లా నాయక్ సినిమా తరవాత స్థానంలో మహేశ్ బాబు హీరోగా నటించిన సర్కారు వారి పాట సినిమా ఉంది. ఈ సినిమా ట్రైలర్ కు 2గం.ల 26ని.లలో 700k లైక్స్ వచ్చాయి. దీని తరవాత స్థానంలో రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా ట్రైలర్ ఉంది. ఈ సినిమా ట్రైలర్ 2గం.ల 49ని.లలో 700k లైక్స్ ను సంపాదించి నాలుగో స్థానంలో నిలిచింది. ఇక ఐదో స్థానంలో రామ్ చరణ్, చిరంజీవి కలిసి నటించిన ఆచార్య సినిమా నిలిచింది. ఈ సినిమా ట్రైలర్‌కు 14గం.ల 59ని.లలో 700k లైక్స్ వచ్చాయి.

- Advertisement -

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు