Animal – Salaar: తప్పంతా ఆడియన్స్‌దేనా..? డైరెక్టర్లది ఏం లేదా?

ఈ వారం థియేటర్స్‌లో యానిమల్ మూవీ వచ్చింది. 3 గంటల 20 నిమిషాలు… A సర్టిఫికేట్ మూవీ… మితిమీరిన శృం*రం… అంతకు మించిన వైలెన్స్… ఇన్నీ ఉన్నా.. సినిమాపై హైప్ విపరీతంగా వచ్చింది. తెలుగు డైరెక్టర్ కావడం, అర్జున్ రెడ్డి లాంటి సినిమా సందీప్ నుంచి రావడం ఒకటి. మరొకటి… బాలీవుడ్ చాక్లెట్ బాయ్ రణబీర్ కపూర్ మొదటి సారి భయంకరమైన పాత్రలో కనిపించాడు. ఇది బాలీవుడ్ ఆడియన్స్ కు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది.

అందుకే ఈ సినిమాపై రిలీజ్ కు ముందు పెద్ద ఎత్తున హైప్ వచ్చింది. కానీ సినిమా రిలీజ్ అయ్యాకా చూస్తే.. సినిమాలో ప్లస్ పాయింట్స్ తో సమానంగా మైనస్ పాయింట్స్ గురించి కూడా మాట్లాడుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా సెకండాఫ్ గురించి. ఈ సారి సందీప్ రెడ్డి వంగా స్క్రీన్ ప్లే పని చేయలేదు అంటూ క్రిటిక్స్ నుంచి రివ్యూస్ వచ్చాయి.

అలాగే అదే డిసెంబర్ 1న వచ్చిన సలార్ ట్రైలర్ కి కూడా నెగిటివ్ టాక్ వచ్చింది. ఎన్నో అంచనాలు పెట్టుకున్న సలార్ ట్రైలర్ నిరాశపరిచింది. ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ సలార్ ట్రైలర్ పై బహిరంగంగానే నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.

- Advertisement -

ఇలా ఈ రెండు సినిమాల విషయంలో నెగిటివిటీ రావడంపై సోషల్ మీడియాలో ఓ టాక్ నడుస్తుంది. సలార్ ట్రైలర్ గానీ, యానిమల్ మూవీ కానీ, బాగానే ఉన్నాయని, కానీ, ఆడియన్స్ అంచనాలు ఎక్కువ పెట్టుకున్నారు. అందువల్లే ఈ రెండు సినిమాలకు నెగిటివిటీ వస్తుందని అంటున్నారు. ఒక వేళ ఎలాంటి అంచనాలు లేకుంటే, సలార్ ట్రైలర్ గానీ, యానిమల్ మూవీ కానీ, సూపర్ హిట్ కంటెంట్ అని చెబుతున్నారు.

అయితే దీనికి కౌంటర్ గా కూడా కొంత మంది కామెంట్స్ చేస్తున్నారు. “సినిమాలకు నెగిటివ్ టాక్ రావడం అనేది ఆడియన్స్ తప్పా..? డైరెక్టర్లది ఏం లేదా అని అంటున్నారు. సినిమా అలా ఉండబోతుంది.. ఇలా ఉండబోతుంది.. ఇండియన్ సినీ హిస్టరీలో రాలేని సినిమా చేస్తున్నాం.. అంటూ గొప్పలు చెప్పుకునేది డైరెక్టర్లు కాదా? పలానా హీరో కెరీర్ లోనే ఇది బిగ్గెస్ట్ హిట్ అవుతుంది అని చెప్పేది ఎవరు? డైరెక్టర్లు కాదా? “ అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

రాజమౌళి తన సినిమా విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాడో అందరికీ తెలుసు కదా. కేవలం తన వర్క్ తోనే హైప్ క్రియేట్ చేస్తాడు అంతే కానీ, సినిమా అలా ఉండబోతుంది… ఇలా ఉంటుందని ఎప్పుడు హైప్ క్రియేట్ చేయడు. ఇదే రాజమౌళికి ఇతర డైరెక్టర్లకి తేడా. డైరెక్టర్లు ఈ విషయంలో జక్కన్న ఫాలో కావాల్సిందే.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు