Sreeleela : సినిమాల కోసం చదువునే త్యాగం చేస్తున్న డాక్టరమ్మ?

మోస్ట్ వాంటెడ్ బ్యూటీ శ్రీలీల ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ ప్లేస్ ను ఆక్రమించుకునే పనిలో బిజీగా ఉంది. టీనేజ్ లోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఒకవైపు చదువుకుంటూ, మరోవైపు సినిమాలు చేస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతోంది. అయితే తాజాగా ఈ బ్యూటీకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సినిమాల కోసం శ్రీలీల తన చదువునే త్యాగం చేసిందట. శ్రీలీల ప్రస్తుతం ఎంబిబిఎస్ చదువుతున్న విషయం తెలిసిందే. ఈ కాబోయే డాక్టరమ్మ నవంబర్ లోనే ఎంబిబిఎస్ ఎగ్జామ్స్ రాయాల్సి ఉందట. కానీ “గుంటూరు కారం” మూవీ షూటింగ్ కారణంగా ఆ ఎగ్జామ్స్ ను వాయిదా వేసిందట.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న “గుంటూరు కారం” మూవీలో శ్రీలీల హీరోయిన్ గా కనిపించబోతున్న విషయం తెలిసిందే. ఈ క్రేజీ ప్రాజెక్టులో భాగం కావడం వల్ల ఏకంగా తన ఎగ్జామ్స్ ని పక్కన పెట్టేసింది శ్రీలీల. ఇటీవల ఆమె నటించిన కొన్ని చిత్రాలు వరుసగా ప్లాప్ అవుతూ వస్తున్న విషయం తెలిసిందే. నవంబర్ లో ఈ బ్యూటీ నటించిన ‘భగవంత్ కేసరి’, ‘ఆదికేశవ’ లాంటి సినిమాలు రిలీజ్ అయ్యాయి. ‘భగవంత్ కేసరి’ బ్లాక్ బస్టర్ హిట్ తో శ్రీలీల కెరీర్ కు బూస్ట్ ఇస్తే, ‘ఆదికేశవ’ మూవీ మాత్రం ఆమె కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. ఈ రెండు సినిమాల ప్రమోషన్లతో పాటు “గుంటూరు కారం” మూవీ షూటింగ్ కారణంగా శ్రీలీల తన డాక్టర్ చదువులకు సంబంధించిన ఎగ్జామ్స్ లో వాయిదా వేసిందట. నెక్స్ట్ సెమిస్టర్ లో ఆ ఎగ్జామ్స్ లో రాయబోతుందట శ్రీలీల.

ఎంతో ముఖ్యమైన డాక్టర్ ఎగ్జామ్స్ ని సైతం పక్కన పెట్టింది అంటే ఈ బ్యూటీ సినిమాల పట్ల ఎంత డెడికేషన్ తో ఉందో అర్థమవుతుంది. అలాగే “గుంటూరు కారం” సినిమాపై శ్రీలీల ఆశలన్నీ పెట్టుకున్నట్టుగా ఈ పరిస్థితిని చూస్తే తెలుస్తోంది. మొత్తానికి కాబోయే డాక్టరమ్మ సినిమాల కోసం తన చదువునే త్యాగం చేయడానికి రెడీ అవుతోంది. మరి ఆమె త్యాగానికి ప్రతిఫలం ఎలా ఉంటుంది అన్నది ఎదురు చూడాల్సిందే. కాగా నితిన్ “ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్” మూవీలో శ్రీలీల హీరోయిన్ గా నటించగా, ఆ మూవీ డిసెంబర్ 8న రిలీజ్ కానుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ మాత్రం నత్త నడకన సాగుతున్నాయి.

- Advertisement -

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు