Extra Ordinary Man : నితిన్ ఈ సినిమా విషయంలో చేసిన బిగ్ మిస్టేక్ ఇదే

యంగ్ హీరో నితిన్ లేటెస్ట్ మూవీ ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్‘ మూవీ ఊహించని విధంగా డిజాస్టర్ గా నిలిచింది. అయితే ఈ మూవీ విషయంలో నితిన్ చేసిన బిగ్ మిస్టేక్ ఇదే. మరి ఆ మిస్టేక్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఎనర్జిటిక్ హీరో నితిన్, మోస్ట్ వాంటెడ్ బ్యూటీ శ్రీలీల జంటగా నటించిన తాజా చిత్రం “ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్”. డైరెక్టర్ వక్కంతం వంశీకి ఈ మూవీ రెండవది. డిసెంబర్ 8న వచ్చిన ఈ మూవీ అందరూ ఊహించినట్టుగానే డిజాస్టర్ గా మిగిలింది. నిజానికి ఈ సినిమా విషయంలో చాలా బ్యాడ్ లక్స్ ఉన్నాయి. నితిన్ కు భీష్మ తర్వాత ఇప్పటివరకు ఒక్క హిట్ కూడా పడలేదు. ఇక హీరోయిన్ శ్రీలీలకు ఈ ఏడాది మొత్తంలో డిజాస్టర్లే ఎక్కువ పడ్డాయి. డైరెక్టర్ విషయానికి వస్తే వక్కంత వంశీ చేసిన ఫస్ట్ మూవీ ప్లాఫ్ గా నిలిచింది. అంతేకాకుండా సినిమాకు తీసుకున్న మ్యూజిక్ డైరెక్టర్ హ్యారీష్ జయరాజ్ కు టాలీవుడ్ లో ఆఫర్లు వస్తున్నప్పటికీ ఒక్క మ్యూజికల్ హిట్ కూడా ఇవ్వలేకపోయాడు. అయితే నితిన్ మాత్రం ఈ సెంటిమెంట్స్ అన్ని దాటుకుని తన సినిమా హిట్ అవుతుందని నమ్మకంతో కనిపించాడు. పైగా ఆ సెంటిమెంట్స్ అన్నింటిని ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ మూవీ మార్చేస్తుందని ప్రామిస్ కూడా చేశాడు.

కానీ ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ మూవీని థియేటర్ల నుంచి తీసేసే అవకాశం కనిపిస్తోంది. ఈ మూవీ నితిన్ గత మూవీ మాచర్ల నియోజకవర్గం కంటే దారుణమైన డిజాస్టర్ ను ఇచ్చింది. సినిమా రిలీజ్ అయి మూడు రోజులు గడుస్తున్నా కూడా కనీసం మాచర్ల నియోజకవర్గం ఫస్ట్ డే అందుకున్న కలెక్షన్స్ కూడా రాబట్టుకోలేకపోయింది. ఈ మూవీ 3.5 కోట్ల లోపే వసూళ్లను రాబడుతుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీంతో ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ మూవీ లైఫ్ టైం కలెక్షన్స్ చూసుకున్నా మాచర్ల నియోజకవర్గం ఓపెనింగ్ డే అంత కలెక్షన్స్ కూడా లేవని సెటైర్స్ వేస్తున్నారు.

- Advertisement -

ఇదిలా ఉంటే ఈ సినిమా ఈ రేంజ్ లో డిజాస్టర్ కావడానికి రెండు మెయిన్ రీజన్స్ ఉన్నాయి. బాడ్ కంటెంట్ ఒక కారణమైతే, రిలీజ్ డేట్ రెండవ కారణం. ప్రస్తుతం అంతా యానిమల్ మేనియా నడుస్తుంది. ఇది చాలాదన్నట్టు ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ మూవీ రిలీజ్ ఒక్కరోజు ముందే నాని “హాయ్ నాన్న” అంటూ వచ్చేశాడు. మరి ఇలాంటి టైంలో సినిమాను రిలీజ్ చేయడం నితిన్ టీం చేసిన తెలివి తక్కువ పని. ఇక కంటెంట్ కూడా రొటీన్ గా ఉండడంతో ప్రేక్షకులు థియేటర్లలో ఈ మూవీ ని చూడడానికి ఆసక్తిని కనబరచడం లేదు.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు