Vijay: విజయ్ ను యవ్వనంగా చూపించడానికి అంత ఖర్చు అవుతుందా..?

మేకప్.. మనుషులను ఎంత యవ్వనంగా చూపించడానికి అయినా ఈ మేకప్ అనేది చాలా సహాయపడుతుంది. ముఖ్యంగా సెలబ్రిటీలను అందంగా చూపించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుందని చెప్పవచ్చు. ఇదిలా ఉండగా ముసలి వాళ్ళను యవ్వనంగా చూపించడానికి.. అలాగే యుక్త వయసులో ఉన్న వాళ్ళను ముసలివాళ్ల లాగా చూపించడానికి కూడా ఈ మేకప్ అనేది ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ క్రమంలోనే చాలామంది స్టార్ హీరోలు వయసు అయిపోయిన కూడా ఇంకా యంగ్ గా ప్రేక్షకులను అలరిస్తున్నారు అంటే దీనికి కారణం మేకప్ అని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన విజయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

వారసుడు, లియో సినిమాలతో తెలుగు ఇండస్ట్రీలో తన మార్కెట్ ను అమాంతం పెంచుకున్న ఈయన ఒక్క తెలుగులోనే తన భవిష్యత్తు సినిమాలకు రూ.25 కోట్ల మేర బిజినెస్ జరిగే ఛాన్స్ ఉంది అని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే వెంకట్ ప్రభూ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తన 68వ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలలో 19 సంవత్సరాల కుర్రాడిగా విజయ్ కనిపిస్తారని తెలుస్తోంది. అయితే ఈ సీన్లలో విజయ్ ను ఇంత యవ్వనంగా చూపించడానికి అయ్యే ఖర్చు అక్షరాలా రూ .6కోట్లు. డీ ఏజింగ్ టెక్నిక్ తో విజయ్ వయసును తగ్గించబోతున్నారని సమాచారం. అత్యాధునిక సాంకేతిక టెక్నాలజీని ఉపయోగించి ఈ సినిమా కోసం విజయ్ ను అత్యంత యవ్వనంగా చూపించబోతున్నారట.

అంతేకాదు ఈ సినిమాతో విజయ్ మరో సక్సెస్ ని అందుకుంటారు అన్న నమ్మకంతో ఉన్నారు చిత్ర బృందం. ఇకపోతే ఈ టెక్నాలజీని ఉపయోగించి విజయ్ ని ఇంకా ఎంత యవ్వనంగా చూపిస్తారని అభిమానులు సైతం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. దర్శకుడు వెంకట ప్రభు విషయానికి వస్తే.. మానాడు సినిమాతో ప్రశంసలు అందుకున్న ఈయన కస్టడీ మూవీ తో భారీ బోల్తా పడ్డారు. మరి ప్రభు ట్రాక్ రికార్డుతో సంబంధం లేకుండా విజయ్ అవకాశం ఇచ్చారు. మరి ఆ నమ్మకాన్ని వెంకట్ ప్రభు నిలబెట్టుకుంటారో లేదో చూడాలి. అంతేకాదు విజయ్ తన లుక్ విషయంలో విమర్శలు రాకుండా వయసును తగ్గించడం కోసం భారీ స్థాయిలో ఖర్చు చేయడానికి కూడా ఓకే చెప్పారని సమాచారం. మరి ఈ సినిమా ఏ విధంగా ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు