Re Release Clash : రజినీకాంత్ బోర్ కొట్టేశాడా? 18 ఏళ్ల తరువాత కమల్ పైచేయి

ప్రస్తుతం సౌత్ లో రీ రిలీజ్ ల హడావిడి ఎక్కువైన విషయం తెలిసిందే. అయితే ఈ క్లాష్ లో దాదాపు 18 ఏళ్ల తర్వాత రజినీకాంత్ పై కమల్ హాసన్ దే పైచేయి అయింది. మరి వీరిద్దరి మధ్య నెలకొన్న ఈ కొత్త క్లాష్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

సౌత్ ఇండియన్ సినిమాలో రీ రిలీజ్ ట్రెండ్ గత కొంతకాలంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం టాలీవుడ్ లో ఈ ట్రెండ్ బోర్ కొట్టేసింది. కానీ కోలీవుడ్ లో మాత్రం ఇంకా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా నెలకొన్న రీ రిలీజ్ ఫైట్ లో రజనీకాంత్ ను కమల్ హాసన్ బీట్ చేశారు. తాజాగా ఉలగనాయకన్ కమల్ హాసన్, సూపర్ స్టార్ రజినీకాంత్ పాత సినిమాలు రెండు రీ రిలీజ్ అయ్యాయి. కమల్ హాసన్ హీరోగా నటించిన ‘ ఆలవంధన్ ‘(అభయ్) మూవీ, రజనీకాంత్ హీరోగా నటించిన ముత్తు మూవీ డిసెంబర్ 8న శుక్రవారం రోజు రిలీజ్ అయ్యాయి. పరిమిత థియేటర్లలో మాత్రమే రిలీజ్ అయిన ఈ రెండు సినిమాల కలెక్షన్లను చూస్తే కమల్ హాసన్ మూవీనే ఎక్కువ వసూళ్లను రాబట్టినట్టు తెలుస్తోంది. ఆక్యుపెన్సి, కలెక్షన్స్, అభిమానుల సంబరాలు పరిగణలోకి తీసుకుంటే బాక్స్ ఆఫీస్ వద్ద కమల్ హాసన్ ఈసారి ఆధిపత్యం చెలాయించారు. ముత్తు మూవీ కంటే అభయ్ మూవీ కి రెట్టింపు కలెక్షన్లు వచ్చాయని సమాచారం. ఇదంతా చూస్తుంటే ముత్తు సినిమాలో టీవీలో చూసి చూసి రజనీకాంత్ మూవీ అంటే ప్రేక్షకులకు బోర్ కొట్టిందా అని అనుమానం వస్తుంది.

40 ఏళ్లకు పైగా సినిమాల్లో నటిస్తున్న దిగ్గజ నటులు కమల్ హాసన్, రజనీకాంత్. వీరిద్దరికీ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చివరిసారిగా 2005 లో రజనీకాంత్, కమలహాసన్ బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడ్డారు. రజనీకాంత్ చంద్రముఖి, కమల్ హాసన్ ముంబై ఎక్స్ప్రెస్ ఒకే రోజు రిలీజ్ అయ్యాయి. చంద్రముఖి మూవీ ఇండస్ట్రీ హిట్ కాగా, ముంబై ఎక్స్ప్రెస్ డిజాస్టర్ గా మిగిలింది. ఇక ఇప్పుడు 18 ఏళ్ల తర్వాత కమల్ బాక్స్ ఆఫీస్ వద్ద రజినీనీ ఢీకొనడంతో పాటు విజయం సాధించాడు. కాగా ముత్తు సినిమాకు కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహించగా, అభయ్ మూవీకి సురేష్ కృష్ణ దర్శకత్వం వహించారు.

- Advertisement -

అప్పట్లో ముత్తు సినిమా ఏకంగా 200 రోజులు థియేటర్లలో ఆడింది. జపాన్ లో సైతం ఈ మూవీ భారీ కలెక్షన్లు రాబట్టింది. అయితే అభయ్ మూవీ మాత్రం పెద్దగా ఆడలేదు. ఈ మూవీలో కమల్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించగా, ఆయన నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి.

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు