Daggubati Family: అందుకే రాముడి పెళ్ళి లంకలో చేశారా..?

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మూవీ మొగల్ గా గుర్తింపు తెచ్చుకున్న దగ్గుబాటి రామానాయుడు కొడుకు సురేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈయన నిర్మాతగా పలు చిత్రాలను నిర్మించి అభిమానులకు కూడా మరింత దగ్గరయ్యారు. ఇక ఈయన కొడుకు అభిరామ్ తాజాగా తన మరదలు ప్రత్యూష ను ఈనెల 6వ తేదీన శ్రీలంకలో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. సాధారణంగా సినీ ఇండస్ట్రీలో డెస్టినేషన్ మ్యారేజ్ ని చాలామంది సెలబ్రిటీలు ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే 200 మందితో సినీ , రాజకీయ నాయకులు, కుటుంబ సభ్యులు , సన్నిహితుల మధ్య వీరి వివాహం శ్రీలంకలో జరిగింది.

అయితే సామాజిక మాధ్యమాలలో మాత్రం అభిరామ్ సోదరుడైన రాణా ఆయన భార్య మిహికాలు ఈ పెళ్లి ఫోటోలలో కనిపించకపోవడంతో మీ అన్న ఎక్కడ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు తాజాగా దగ్గుబాటి అభిరామ్ తన వివాహాన్ని శ్రీలంకలో ప్లాన్ చేసి చాలా గ్రాండ్ గా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవడంతో.. ఇన్ని అద్భుతమైన ప్రదేశాలు ఉండగా శ్రీలంకలోనే ఎందుకు వివాహం చేసుకున్నారు అంటూ ఒక్కొక్కరు ఒక్కోరకంగా కామెంట్లు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ప్రముఖ నటి శ్రీరెడ్డికి భయపడే దగ్గుబాటి సురేష్ బాబు శ్రీలంకలో అభిరామ్ వివాహాన్ని జరిపించారు అని కామెంట్ లు వినిపిస్తున్నాయి.

అసలు విషయంలోకెళితే గతంలో దగ్గుబాటి అభిరామ్ తనను వాడుకొని తనకు హీరోయిన్గా అవకాశం ఇప్పిస్తానని చెప్పి క్లోజ్ గా మూవ్ అవడమే కాకుండా శారీరకంగా వాడుకున్నాడు అని శ్రీరెడ్డి ఆరోపణలు చేసిన విషయం అందరికీ తెలిసిందే. అంతే కాదు చాలామంది సినీ ఇండస్ట్రీలో తనను వాడుకొని అవకాశాలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారని మా అసోసియేషన్ ముందు ఈమె అర్థనగ్నంగా నిరసన కూడా తెలియజేసింది. అప్పట్లో రానా తన బావగారు అని, సురేష్ బాబు తన మామ అని పెద్ద గోల చేసిన ఈమె ఆ తర్వాత కాలంలో సైలెంట్ అయిపోయింది. అయితే శ్రీరెడ్డి నోరు వేసుకొని అందరి మీద పడిపోతుండడం చూసి ఎందుకులే మాకు ఈ గోల అని ఆలోచించిన దగ్గుబాటి ఫ్యామిలీ ఈ పెళ్లిని అలా శ్రీలంకలో జరిపించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో ఎంత నిజం ఉందన్నది తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది.

- Advertisement -

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు