Biggboss season7: తన అపాలజీ తో నాగ్ ని మెప్పించిన శివాజీ!

బిగ్ బాస్ సీజన్ 7 లో లాస్ట్ వీక్ ఎలిమినేషన్ డే వచ్చేసింది. ఈ క్రమంలో ఉన్న ఏడుగురు కంటెస్టెంట్స్ ని నాగార్జున శనివారం రోజు గట్టి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా శివాజీ ని నాగార్జున ఫస్ట్ టైం చాలా స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇవ్వడమే గాకుండా శివాజీ ఆడవాళ్ళని అన్న మాటలకి అపాలజీ చెప్పించాడు. అయితే శివాజి ముందు తాను చేసిన తప్పుకు ఇష్టం లేకుండానే శోభా, ప్రియాంక కి సారీ చెప్పాడు.

కానీ ఆదివారం రోజు నాగార్జున ముందు కంటెస్టెంట్స్ అందరూ 14 వారాల్లో చేసిన ఒక పెద్ద మిస్టేక్ ని ఒక్కొక్కరు గా చెప్పుకుంటూ రియలైజ్ అయ్యారు. ఈ క్రమంలో శివాజీ మాత్రం తాను ఆడిన అన్ని వారాల్లో కంటే ఈ వారం పెద్ద మిస్టేక్ చేసానని, ఆడపిల్లల్ని తాను కావాలని అనలేదని, పొరపాటున మాటల్లో దొర్లింది అని చెప్పాడు. దానికి మళ్ళీ మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నా అని నాగార్జున ముందు అన్నాడు.

అయితే ఈ మాట తో రియలైజ్ అయిన నాగార్జున శివాజీ ని ప్రశంసించాడు. అందుకే ఆడియన్స్ ఇంత సపోర్ట్ చేస్తున్నారు, నీ మీద ఆడియన్స్ కి అంత నమ్మకం అని శివాజీని మెప్పించాడు. ఏది ఏమైనా ఈ వారం మాత్రం చాలా మిస్టేక్స్ జరగగా, దానికి తగ్గట్టుగానే అందరికి స్ట్రాంగ్ వార్నింగ్ కూడా వచ్చిందని చెప్పొచ్చు. ఇక ఈ వారం శోభా శెట్టి ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు