Biggboss season7: ఫన్ గా అయినా అమర్ విషయంలో కరెక్ట్ మాట అన్న నాగ్!

బిగ్ బాస్ సీజన్ 7 మరో పది రోజుల్లో ముగుస్తుందన్న విషయం తెలిసిందే. అందుకని బిగ్ బాస్ ఆడియన్స్ కూడా ఎంతో ఇంట్రస్ట్ తో ఈ షో ని వీక్షిస్తూ టిఆర్పి రేటింగ్ ని ఓ రేంజ్ లో తీసుకెళ్తున్నారు. ఇక బిగ్ బాస్ లో ఈ రోజు ఎలిమినేషన్ డే కావడంతో బిగ్ బాస్ లో ఎవరు ఎలిమినేట్ అవుతారా అని బిగ్ బాస్ ఆడియన్స్ ఎంతో వెయిట్ చేస్తున్నారు. అయితే చాలా మంది శోభా శెట్టి ఎలిమినేట్ అవుతుందని అంచనా వేస్తున్నారు.

ఇదిలా ఉండగా శనివారం మొత్తం బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కి గట్టి వార్నింగ్ ఇచ్చిన నాగార్జున వాళ్ళని రిలాక్స్ చేయడానికి ఆదివారం ఒక మీమ్స్ టాస్క్ ని పెట్టాడు. ఈ టాస్క్ లో నాగార్జున కొన్ని మీమ్స్ ని ని టేబుల్ పైన పెట్టి అందులో ఏది ఎవరికీ సూట్ అవుతుందో వాళ్ళకి పెట్టమని నాగార్జున చెప్తాడు.

అయితే ఈ ఫన్ గేమ్ లో ఎక్కువ మంది అమర్ దీప్ కి మీమ్స్అంటించారు. ఈ క్రమంలో నాగార్జున అమర్ దీప్ ని, అమర్ నువ్వు పూర్తిగా మీమ్ మెటీరియల్ అన్నమాట! అని అన్నాడు. అయితే ఈ వారం అమర్ చేసిన మిస్టేక్స్ కి పెద్దగా వార్నింగ్ ఇవ్వకపోయినా, నాగ్ ఈ మీమ్స్ విషయంలో అన్న మాట మాత్రం కరెక్ట్ అని ఆడియన్స్ అంటున్నారు. ఎందుకంటే అమర్ దీప్ ఒక్కోసారి ప్రవర్తించిన తీరు సీరియస్ గా ఉన్నా ఫైనల్ గా అమర్ కామెడీ అయిపోయాడు.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు