Nani : వీకెండ్ లో “హాయ్ నాన్న” రచ్చ..

న్యాచురల్ స్టార్ నాని మళ్ళీ మళ్ళీ అదరగొడుతున్నాడు. ఈ సమ్మర్ కి దసరా తో వచ్చి మాస్ బ్లాక్ బస్టర్ కొట్టి కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్న నాని ఇప్పడు ఒక క్లాస్ సినిమాతో కూడా తన బాక్స్ ఆఫీస్ సత్తా చాటుతున్నాడు. నాని హీరోగా శౌర్యువ్ దర్శకత్వంలో వచ్చిన ‘హాయ్ నాన్న’ ఈ డిసెంబర్ 7 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఒక ఫీల్ గుడ్ ఎమోషనల్ లవ్& ఫ్యామిలీ ఎంటర్టైనర్ తెరకెక్కిన ఈ సినిమా ఆడియన్స్ నుండి డీసెంట్ టాక్ ను సొంతం చేసుకుంది.

అయితే ఈ సినిమాకి ఫస్ట్ డే వచ్చిన కలెక్షన్లు చూసి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ, నాని గత చిత్రమైన అంటే సుందరానికి మూవీ లాగా హిట్ టాక్ తెచ్చుకున్నా, తక్కువ కలెక్షన్లు తెచ్చుకుని ప్లాప్ గా నిలుస్తుందని అంచనా వేశారు. కానీ హాయ్ నాన్న మౌత్ టాక్ తో వీకెండ్ లో పుంజుకుని కలెక్షన్లతో రచ్చ చేసాడు.

ఫస్ట్ డే హాయ్ నాన్న వరల్డ్ వైడ్ గా 5 కోట్ల వరకు షేర్ సాధించగా, ఒక్కో రోజు మెల్లిగా గ్రోత్ ని చూపించి వీకెండ్ లో సాలిడ్ వసూళ్లు అందుకుంది. ముఖ్యంగా ఓవర్సీస్ లో హాయ్ నాన్న వీకెండ్ లో బ్రేక్ ఈవెన్ కూడా అయిపొయింది. ఇక నాలుగు రోజుల లాంగ్ వీకెండ్ లో హాయ్ నాన్న తెలుగు రాష్ట్రాల్లో 12.91 కోట్ల షేర్, 23 కోట్ల గ్రాస్ ని రాబట్టగా, వరల్డ్ వైడ్ గా 21.11 కోట్ల షేర్ ని 39.95 కోట్ల గ్రాస్ ని వసూలు చేసింది. ఇక 28 కోట్ల టార్గెట్ తో రిలీజ్ అయిన హాయ్ నాన్న బ్రేక్ ఈవెన్ కావాలంటే ఇంకా 7.39 కోట్ల వరకు వసూలు చేయాలి. మరి వర్కింగ్ డేస్ లో సినిమా ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.

- Advertisement -

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు