Salaar Leak : ప్రభాస్ కు అండగా రాఖీ భాయ్… ఫ్యూజులు ఎగరిపోయే ఎంట్రీ

మోస్ట్ అవైటెడ్ మూవీ “సలార్ “కి, బ్లాక్ బస్టర్ యాక్షన్ ఎంటర్టైనర్ “కేజిఎఫ్”కి లింక్ ఉందా? రాఖీ బాయ్ ప్రభాస్ కు అండగా నిలబడబోతున్నాడా? ఈ విషయానికి సంబంధించి తాజాగా బయటకు వచ్చిన లీక్ ఏంటి అసలు? అనే విషయంలోకి వెళ్తే…

హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ “సలార్ ” మూవీ డిసెంబర్ 22న థియేటర్లలోకి రాబోతోంది. ఈ మూవీలో ప్రభాస్ సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇద్దరు స్నేహితుల స్నేహబంధం నేపథ్యంలో వస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ లో పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రభాస్ స్నేహితుడిగా కనిపించబోతున్నాడు. కేజిఎఫ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ “సలార్ ” మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. దీంతో మామూలుగానే ఈ రెండు సినిమాలకు పోలిక పెడుతూ ఉంటారు సినీ విశ్లేషకులు. అంతేకాకుండా సినిమాను ప్రకటించినప్పటి నుంచి “కేజిఎఫ్ ” హీరో రాఖీ బాయ్ “సలార్” మూవీలో కూడా కనిపించబోతున్నాడని, సలార్ మూవీ కేజిఎఫ్ కు కంటిన్యూయేషన్ అని ప్రచారం జరిగింది. కానీ రీసెంట్ గా జరిగిన ఇంటర్వ్యూలో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ కేజిఎఫ్ కు, సలార్ మూవీకి లింక్ లేదని, ఇవి రెండు వేరువేరు సినిమాలని క్లారిటీ ఇచ్చాడు. దీంతో సలార్ మూవీలో రాఖీ భాయ్ ఎంట్రీ ఉంటుందని ఎంతగానో ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు నిరాశ ఎదురయింది.

అయితే తాజాగా జరిగిన లీక్ ప్రకారం సలార్ మూవీలో యశ్ కూడా కనిపించబోతున్నాడు. ఈ విషయాన్ని సలార్ మూవీ కోసం సాంగ్స్ పాడిన ఓ పాప రివీల్ చేసింది. కేరళకు చెందిన తీర్థ అనే పాప సలార్ సినిమాలోనీ ఓ పాటను మూడు భాషల్లో పాడింది. ఆ పాప రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సలార్ మూవీలో ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ తో పాటు యశ్ కూడా ఉంటాడనే విషయాన్ని రివీల్ చేసింది. దీంతో ప్రభాస్ కు రాఖీ భాయ్ అండగా ఉంటాడని, సినిమాలో రాఖీ భాయ్ ఎంట్రీ ఫ్యూజులు ఎగిరిపోయేలా ఉంటుందని అంచనా వేస్తున్నారు మూవీ లవర్స్. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియదు కానీ సినిమాపై అంచనాలు మాత్రం రోజురోజుకు పెరిగిపోతున్నాయి.

- Advertisement -

కానీ కొంతమంది మాత్రం యశ్ సినిమా షూటింగ్ చూడడానికి వచ్చి ఉంటాడు, ఇలాంటి న్యూస్ వల్ల హైప్ పెరిగి సినిమాపై ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి ఇలాంటి న్యూస్ స్ప్రెడ్ చేయకండి రా బాబు అని నెత్తి నోరు కొట్టుకుంటున్నారు. ప్రశాంత్ నీల్ ఆల్రెడీ ఆ రెండు సినిమాలకు కనెక్షన్ లేదని చెప్పాడు. కాబట్టి సినిమాలో యశ్ కనిపించే అవకాశం లేదని కామెంట్స్ చేస్తున్నారు. కాగా ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న సలార్ మూవీ మరో పది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ మూవీతోనైనా ప్రభాస్ హిట్ కొడతాడా అనేది వేచి చూడాలి.

 

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు