Salaar : వైలెన్స్ వైలెన్స్ వైలెన్స్… ప్రశాంత్ నీల్ కాంట్ అవాయిడ్ ఇట్

ప్రేక్షకులంతా కళ్ళల్లో వత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘సలార్ ‘. ఈ సినిమాకు కేజీఎఫ్ ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. అయితే ఆయన ప్రస్తుతం ఫుల్ వైలెన్స్ మూడ్ లో ఉన్నారు. తాజాగా బయటకు వచ్చిందా ‘సలార్ ‘ సెన్సార్ రిపోర్ట్ చూస్తే ఆ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. సెన్సార్ రిపోర్టు ప్రకారం ఈ మూవీ రన్ టైం 2 గంటల 55 నిమిషాలు ఉండగా, ఏ సర్టిఫికెట్ ను జారీ చేశారు. అయితే ఈ ఏ సర్టిఫికెట్ అనేది సినిమాలో ఉన్న వయోలెన్స్ కు సూచన అని అర్థమవుతుంది.

ప్రశాంత్ నీల్ గత చిత్రం కేజిఎఫ్ సిల్వర్ స్క్రీన్స్ ని ఎలా షేర్ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వైలెన్స్ అనే ట్రెండ్ ఈ మూవీ నుంచే స్టార్ట్ అయింది. ఈ సినిమాలో ఉన్నంత రక్తపాతం, యాక్షన్ గతంలో మరే సినిమాలో రాలేదని చెప్పాలి. ఇక ప్రస్తుతం వస్తున్న సినిమాలన్నీ అదే ట్రెండును ఫాలో అవుతున్నాయి. ప్రశాంత్ నీరు సైతం ఆ వైలెన్స్ నుంచి బయటకు రాలేకపోతున్నాడు. సలార్ మూవీ సెన్సార్ సభ్యుల నుంచి ఏ సర్టిఫికెట్ ను పొందడం చూస్తుంటే కేజిఎఫ్ మూవీలో ప్రశాంత్ నీలు రాసిన ఓ పవర్ ఫుల్ డైలాగ్ గుర్తొస్తుంది. ” వైలెన్స్ వైలెన్స్ వైలెన్స్… ఐ డోంట్ లైక్ ఇట్… ఐ అవాయిడ్.. బట్ వైలెన్స్ లైక్స్ మీ… ఐ కాంట్ అవాయిడ్” అంటూ రాఖీ బాయ్ చెప్పిన డైలాగ్ సినిమాపై ప్రేక్షకులపై ఎంతటి ఎఫెక్ట్ చూపించిందో అందరికీ తెలిసిందే. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఇప్పుడు సలార్ మూవీ విషయంలో ఆ డైలాగ్ ను నిజం చేస్తున్నాడు. కేజిఎఫ్ తో దిమ్మతిరిగే బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్ వైలెన్స్ ను అవాయిడ్ చేయలేకపోతున్నాడు.

కేజిఎఫ్ మూవీలో ఉన్న వైలెన్స్ కు సైతం సెన్సార్ సభ్యులు U/A సర్టిఫికెట్ ను జారీ చేశారు. కానీ సలార్ విషయంలో మాత్రం అలా జరగలేదు. “సలార్ “కు ఏకంగా ఏ సర్టిఫికెట్ జారీ చేయడంతో ఈ సినిమాలో యాక్షన్ లెవెల్, హీరో విలన్ల మధ్య జరిగే పోరులో రక్తపాతం ఏ లెవెల్ లో ఉంటుందోననే చర్చ మొదలైంది. ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకగా, ప్రస్తుతం జరుగుతున్న ఈ సెన్సార్ సర్టిఫికెట్ గోలతో మరింతగా ఉత్కంఠత పెరిగింది. దీంతో ఈ మూవీ ని థియేటర్లలో ఎప్పుడు ఎప్పుడు వీక్షిస్తామా అని యాక్షన్ లవర్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో డార్లింగ్ ప్రభాస్ హీరోగా నటిస్తుండగా, శృతిహాసన్ ఆయనతో రొమాన్స్ చేయబోతోంది. పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు కీలకపాత్రలో కనిపించబోతున్నారు. డిసెంబర్ 22న ‘ సలార్’ మూవీ ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున రిలీజ్ కాబోతోంది.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు