Sankranthi Movies: మరో రెండు సినిమాలు వాయిదా… నాగ్, రవితేజ వెనక్కి తగ్గబోతున్నారా?

సంక్రాంతి సీజన్లో రిలీజ్ కావడానికి చాలా సినిమాలు రెడీగా ఉన్నాయి. అయితే ఈ రేసు నుంచి ఇప్పటికే పలు సినిమాలు తప్పుకున్న విషయం తెలిసిందే. అయితే మిగిలి ఉన్న సినిమాల్లో కూడా మరో రెండు సినిమాలు వాయిదా పడే అవకాశం ఉన్నట్టు సమాచారం. మరి ఆ రెండు సినిమాలు ఏంటి? అవి వాయిదా పడతాయి అనిపించడానికి గల కారణం ఏంటి? అనే వివరాల్లోకి వెళ్తే…

2024 సంక్రాంతి పండుగకు సూపర్ స్టార్ మహేష్ బాబు ‘గుంటూరు కారం’, విక్టరీ వెంకటేష్ ‘ సైంధవ్, మాస్ మహారాజా రవితేజ ‘ ఈగల్’, కింగ్ నాగార్జున ‘నా సామిరంగా’, తేజ సజ్జ ‘హను మాన్’ సినిమాలతో థియేటర్లలో సందడి చేయబోతున్నారు. అయితే ఈ లిస్టులో నుంచి నాగార్జున, రవితేజ సినిమాలు తప్పుకోబోతున్నాయని ప్రచారం జరుగుతుంది. గుంటూరు కారం, సైంధవ్ సినిమాలకు సంబంధించిన అన్ని రైట్స్ డీల్స్ ఇప్పటికే పూర్తయ్యాయి.

ప్రస్తుతం ఈ రెండు సినిమాలకు సంబంధించిన ప్రమోషనల్ ఈవెంట్స్ ను ప్లాన్ చేస్తున్నారు చిత్ర బృందం. అయితే రవితేజ ‘ఈగల్’, నాగార్జున ‘నా సామి రంగ’ మూవీ నాన్ థియేట్రికల్ డీల్స్ ఇంకా క్లోజ్ అవ్వలేదని సమాచారం. నిజానికి ఈ రెండు సినిమాల రిలీజ్ డేట్ గురించి మేకర్స్ అయోమయంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఒకవేళ సంక్రాంతికి ఈ రెండు సినిమాలను థియేటర్లలోకి తీసుకురావాలని అనుకుంటే నాన్ థియేట్రికల్ త్వరగా క్లోజ్ చేయాల్సి ఉంటుంది.

- Advertisement -

లేదంటే నిర్మాతలపై భారం పడే అవకాశం ఉంటుంది. థియేటర్ రిలీజ్ తర్వాత డిజిటల్ రైట్స్ డీల్స్ ను అమ్మడం అనేది నిజానికి చాలా కష్టమైన పని. అంతేకాకుండా సంక్రాంతి రేసులో చాలా సినిమాలు ఉండడంతో ఈగల్, నా సామి రంగ సినిమాలకు థియేట్రికల్ డీల్స్ ఎక్కువగా ఉండకపోవచ్చు. నాగార్జున గత చిత్రాలన్నీ భారీ డిజాస్టర్ గా మిగిలాయి. దీంతో నాగ్ థియేట్రికల్ మార్కెట్ బాగా తగ్గిపోయింది. మరోవైపు రవితేజ మార్కెట్ స్థిరంగా లేనేలేదు. దీంతో ఈ రెండు సినిమాలు వాయిదా పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

ఈగల్ మూవీ ని రిపబ్లిక్ డే కానుకగా రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. నా సామిరంగా టీం ఇప్పటికే ప్రమోషన్స్ అయితే స్టార్ట్ చేసింది. కానీ రిలీజ్ అయ్యే అవకాశం మాత్రం కనిపించడం లేదు. ఇక మిగిలింది మూడు సినిమాలు. అందులో హను మాన్ మూవీని గుంటూరు కారం మూవీ కంటే ఒకరోజు ముందుగానే రిలీజ్ చేస్తారని టాక్ నడుస్తోంది. ఇక సంక్రాంతి రోజు పోటీ మహేష్ బాబు, వెంకటేష్ మధ్య జరిగే అవకాశం ఉంది.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు