Adi Reddy: కొత్త బిజినెస్ మొదలు పెట్టిన బిగ్ బాస్ ఆదిరెడ్డి.. చీఫ్ గెస్ట్ అతడే..!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలామంది తమ టాలెంట్ ని ఉపయోగిస్తూ భారీ పాపులారిటీ దక్కించుకున్న విషయం తెలిసిందే. అలాంటి వారిలో బిగ్ బాస్ ఆదిరెడ్డి కూడా ఒకరు. నెల్లూరుకి చెందిన ఈయన ఒక చిన్న కంపెనీలో ఎలక్ట్రికల్ ఇంజనీర్ గా పనిచేస్తూ.. యూట్యూబ్లో బిగ్ బాస్ రివ్యూలు , వీడియోలు పోస్ట్ చేస్తూ ఉండేవాడు. ఇక బిగ్ బాస్ పై ఆది వీడియోలు చేయడం మొదలుపెట్టిన తర్వాత కొంచెం పాపులారిటీ తెచ్చుకున్నాడు. అలాగే ఆ వీడియోలతో పేరు తెచ్చుకున్న ఆదిరెడ్డికి ఏకంగా బిగ్ బాస్ లోకి కామన్ మ్యాన్ క్యాటగిరిలో పిలుపు రావడంతో ఒక్కసారిగా అతని లైఫ్ మొత్తం మారిపోయిందని చెప్పాలి.

బిగ్ బాస్ సీజన్ 6 లో పాల్గొన్న ఆదిరెడ్డి ఫైనల్ వరకు వెళ్లి సెన్సేషన్ సృష్టించాడు. ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సెలబ్రిటీ హోదా తెచ్చుకున్న ఆదిరెడ్డి యూట్యూబ్లో కొన్ని వీడియోలు చేస్తూ పలు టీవీ షోలలో కూడా సందడి చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఆదిరెడ్డి ఒక కొత్త బిజినెస్ మొదలు పెట్టినట్లు తెలుస్తోంది విజయవాడలో ప్రముఖ సెలూన్ కంపెనీ.. జావిద్ హబీబ్ బ్రాంచ్ తీసుకున్న ఆదిరెడ్డి తాజాగా ఈ సెలూన్ ప్రారంభోత్సవానికి సింగర్ , బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ ని ముఖ్యఅతిథిగా ఆహ్వానించారు. ఇకపోతే రాహుల్ సిప్లిగంజ్ గతంలో బార్బర్గా పనిచేసిన విషయం తెలిసిందే. అలాగే ఆదిరెడ్డి తో మంచి అనుబంధం ఉన్న కారణంగా రాహుల్ ఈ సెలూన్ ఓపెనింగ్ కార్యక్రమానికి హాజరయ్యారు.

అందుకు సంబంధించిన ఫోటోలు , వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. ఇకపోతే ఈ ఫోటోలను, వీడియోలను ఆదిరెడ్డి తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తూ..” మా కోసం విజయవాడ వచ్చి సెలూన్ ఓపెనింగ్ చేసినందుకు రాహుల్ సిప్లిగంజ్ అన్న నీకు ధన్యవాదాలు .. నా లైఫ్ లో ఇది మొదటి బిజినెస్.. దీనివల్ల చాలామందికి ఉపాధి దొరుకుతుందని ఆశిస్తున్నాను.. ప్రస్తుతానికి ఒక 15 మందికి వర్క్ ఇస్తున్నాము.. అందుకే చాలా సంతోషంగా ఉంది”.. అంటూ ఎమోషనల్ అయ్యారు ఆదిరెడ్డి. దీంతో పలువురు సెలబ్రిటీలు కూడా ఆదిరెడ్డికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు