Lifestyle Tips : చలి కాలంలో గడ్డం పెంచితే ఏమవుతుందో తెలుసా?

చాలామంది అబ్బాయిలు గడ్డాన్ని పెంచుకోవడానికి, స్టైలిష్ గా కనిపించడానికి ఇష్టపడుతుంటారు. అయితే కొంతమంది మాత్రం గడ్డం పెంచాలా వద్దా అని సందిగ్ధంలో ఉంటారు. మరి చలికాలంలో గడ్డం పెంచితే ఏమవుతుందో తెలుసా?

గడ్డం పెంచడం అనేది అబ్బాయిలకు ఒక హాబిట్ మాత్రమే కాదు అది వారికి మ్యాన్లీ లుక్ ను కూడా ఇస్తుంది. కానీ దాన్ని సరిగ్గా మేనేజ్ చేయకపోతే లుక్ ఖరాబ్ అవ్వడమే కాకుండా, కాన్ఫిడెన్స్ దెబ్బతినేలా చేస్తుంది. అయితే ఇప్పుడు గడ్డం ఎందుకు పెంచుకోవాలి? ముఖ్యంగా చలికాలంలో గడ్డాన్ని పెంచుకోవడం వల్ల ఏమవుతుంది? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

గడ్డం చారి నుంచి రక్షిస్తుందని మీకు తెలుసా? అతి శీతలమైన చలికాలంలో కూడా గడ్డం ఉంటే అంత చలిగా అనిపించదు.

- Advertisement -

చలికాలంలో మిమ్మల్ని వెచ్చగా ఉంచే గడ్డం ఎండాకాలంలో మాత్రం చల్లగా ఉంచుతుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం మందపాటి గడ్డం ఉంటే సూర్య నుంచి వెలువడే హానికరమైన యువి రేస్ ఎఫెక్ట్ 95% వరకు మొహంపై పడకుండా చేస్తుందట.

మీరు చేస్తున్న పనిపై ఫోకస్ చేయడంలో గడ్డం సహాయపడుతుంది. గడ్డం అనేది అబ్బాయిల మనసులను ఉత్తేజపరుస్తుంది. కాబట్టి వారు చేస్తున్న పనులపై దృష్టి పెట్టడంలో ఇది హెల్ప్ అవుతుంది.

ఇక గడ్డంతో ఆడుకోవడం ఎంత సరదాగా ఉంటుందో అది గడ్డం పెంచుకునే వాళ్లకే తెలుస్తుంది. పొడవాటి గడ్డాన్ని పెంచుకుని దాన్ని దువ్వడం సరదాగా ఉంటుందట.

మీరు తెలివిగా, బాగా ఎదిగినట్టుగా కనిపించాలనుకుంటే గడ్డం పెంచాలి. గడ్డం పెంచడం వల్ల మ్యాన్లీ లుక్ వస్తుంది. దీంతో అవతలి వ్యక్తి మిమ్మల్ని చూసే విధానం మారిపోతుంది.

గడ్డం కాన్ఫిడెన్స్ ను పెంచుతుంది. గడ్డాన్ని పెంచే పురుషులు తమను తాము సింహాలు, ఎలుగుబంట్లతో పోల్చుకుంటారట. అందుకే వారిలో మరింత ఎనర్జీ, కాన్ఫిడెన్స్ పెరుగుతాయట.

గడ్డం పెంచితే ఎలాంటి దుస్తులతో అయినా అద్భుతంగా కనిపిస్తారు.

షేవింగ్ చేయడం వల్ల ఫేస్ పై మొటిమలు వస్తాయి. అలాగే అక్కడక్కడ ముఖంపై గాట్లు పడతాయి. గడ్డం పెంచితే వాటి నుంచి మీ ఫేసును సేవ్ చేసుకోవచ్చు.

గడ్డం అనేది చర్మం పై మొటిమలు, మచ్చలు పడకుండా కాపాడుతుంది కాబట్టి మీరు ఎక్కువ కాలం యవ్వనంగా కనిపించొచ్చు. ఇక గడ్డం వల్ల సూర్యలక్ష్మి మొహంపై పడడానికి చాలా తక్కువ అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ముఖంపై ముడతలు పడే అవకాశం తక్కువ. అంతేకాకుండా అలర్జీ, ఉబ్బసం, చిగుళ్ల వ్యాధి, గొంతు వ్యాధి వంటి వ్యాధులకు కారణమయ్యే బ్యాక్టీరియాకు వ్యతిరేకంగా మీ గడ్డం పనిచేస్తుంది. అంటే అవి నీ మొహం వైపు రాకుండా గడ్డం సహజ ఫిల్టర్ గా పనిచేస్తుంది.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు