Aryan Khan : 8ఏళ్ళు పెద్దయిన అమ్మాయితో ప్రేమలో షారుఖ్ కొడుకు?

Aryan Khan : బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్ తర్వాత ఆ రేంజ్ లో సినిమాలతో నెంబర్ వన్ గా ఏలిన స్టార్ ఎవరూ అంటే అది షారుఖ్ ఖాన్ అని చెప్పాలి. గత కొన్నేళ్లలో ఫామ్ లో లేకపోయినా లాస్ట్ ఇయర్ తన సినిమాలతో ఒక్కసారిగా ఎంత భీభత్సం సృష్టించాడో చూసారుగా. అలాంటి షారుఖ్ ప్రేక్షకుల మనస్సులో కూడా బాద్ షా గా చెరగని ముద్ర వేసుకున్నాడు. అయితే షారుఖ్ ఖాన్ కి బయట ఇంత మంచి ఫాలోయింగ్ క్రేజ్ ఉన్నా, ఆ పేరుని మాత్రం మొత్తం ఇంట్లో వాళ్ళే నాశనం చేస్తున్నారు. అంటే ఈ పాటికే అర్ధమయ్యి ఉండాలి. అతనే షారుక్ తనయుడు ఆర్యన్ ఖాన్. తండ్రి రూపాన్ని అందుకున్న ఇతడు, తండ్రి లా సినిమాల్లో రొమాన్స్ నిజమనుకున్నాడో ఏమో, బయట సోషల్ మీడియాలో మాత్రం అమ్మాయిలతో రచ్చ చేస్తాడు. ఆ మధ్య అమితాబ్ మానవరాలితో కూడా అఫైర్ నడిపిన విషయం తెలిసిందే. అప్పట్లో వీరి ఫొటోలు నెట్టింట పెనుసంచలనం రేపాయి. ఇక మొన్నటికిమొన్న బాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారంలో కూడా ఆర్యన్ ఖాన్ పేరు వినిపించింది. ఇదిలా ఉండగా తాజాగా మరో ప్రేమ వ్యవహారం నెట్టింట తెగ వైరల్ అవుతుంది.

ఆ దేశపు నటితో లవ్ లో?

షారూఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్(Aryan Khan) తాజాగా బ్రెజిల్ నటి కం మోడల్ లారిస్సా బొనేసితో రిలేషన్ షిప్‌లో ఉన్నాడని వార్తలు వస్తున్నాయి. వారు జంట‌గా కలిసి కనిపించిన తర్వాత ఊహాగానాలు మరింత ఎక్కువయ్యాయి. ఇక వారిద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు ఫాలో అవుతున్నారు కూడా. అయితే మీడియాలో ఎంత హ‌డావుడి జ‌రుగుతున్నా ఆర్యన్ ఖాన్ లేదా లారిస్సా బోనేసి వారి రిలేషన్ షిప్ స్టేటస్‌కు సంబంధించి అధికారికంగా ఏమీ చెప్పలేదు. రీసెంట్ గా లారిస్సా ముంబైలో పార్టీల్లో ఎక్కువ‌గా క‌నిపించ‌డంపై కూడా ర‌క‌ర‌కాల గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. తాజాగా మ‌రోసారి పార్టీకి వెళుతూ లారిస్సా కెమెరా కంటికి చిక్కింది. ఆర్య‌న్ ప్ర‌స్తుతం లారిస్సా, ఆమె కుటుంబ స‌భ్యుల‌తో స‌న్నిహితంగా మెలుగుతున్నాడు. సామాజిక మాధ్య‌మాల్లోను వారంతా రెగ్యుల‌ర్ గా ట‌చ్ లో ఉంటున్నారు. అలాగే లారిస్సా బాలీవుడ్ లో కెరీర్ కోసం ఆర్య‌న్ స‌హ‌కారం అంద‌నుంద‌ని కూడా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

తనకంటే 8 ఏళ్ళు చిన్న?

అయితే ఆర్యన్ ఖాన్ కంటే లారిస్సా 8 ఏళ్ళు పెద్దది కావడం గమనార్హం. తనకంటే వయసులో అంత పెద్ద అయిన అమ్మాయితో లవ్ రేలషన్ షిప్ ఏంటని బాలీవుడ్ లో తెగ చర్చలు నడుస్తున్నాయి. అయితే గతంలో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా తనకంటే 10 ఏళ్ళు చిన్నవాడైన యువకుడిని పెళ్లిచేసుకుందని కూడా గమనించాలి. అంటే బాలీవుడ్ లో ఇవి ఎంత సాధారణమో తెలిసిందేగా. లారిస్సా 1990లో జ‌న్మించగా, ఆర్య‌న్ 1997 లో పుట్టాడు. ఈ ఇద్ద‌రి మ‌ధ్యా ఏడున్నరేళ్ళ గ్యాప్ క‌నిపిస్తోంది. ఇక త‌న‌కంటే వ‌య‌సులో పెద్ద‌ది అయిన లారిస్సాను ఆర్య‌న్ ప్రేమించ‌డంపై ఖాన్ అభిమానుల్లోనూ చ‌ర్చ సాగుతోంది. ఇక లారిస్సా రీసెంట్ గా ముంబైలోనే ఉంటుందట. దీంతో వారు డేటింగ్‌లో ఉన్నారనే పుకార్లు మొద‌ల‌య్యాయి. ఇక ఈ బ్యూటీ కొన్ని హిందీ, తెలుగు చిత్రాలలో కూడా న‌టించింది. అక్షయ్ కుమార్, జాన్ అబ్రహం న‌టించిన `దేశీ బాయ్జ్` పాటలో సుబా హోనే నా దేలో కూడా ఒక నర్తకిగా క‌నిపించింది. సైఫ్ అలీ ఖాన్ న‌టించిన గో గోవా గాన్‌ లో కూడా ఆమె చిన్న పాత్ర పోషించింది. తెలుగులో సాయి ధరమ్ తేజ్ నటించిన తిక్క చిత్రంలో లారిస్సా కనిపించింది. యాక్షన్ కామెడీ నేప‌థ్యంలో రూపొందిన తిక్క‌ చిత్రంలో ఆమె హీరోయిన్. ఇక మోడల్‌గా లారిస్సా పలు బ్రాండ్ ప్రకటనల్లో కనిపించింది. మరి ఆర్యన్ ఖాన్ లారిస్సా పై వస్తున్న వార్తలపై షారుఖ్ ఏమైనా స్పందిస్తాడా చూడాలి.

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు